తల్లీకొడుకులు టెన్త్ ఒకేసారి పాసయ్యారు

ప్రస్తుతం ఆమె వయస్సు 36 ఏళ్లు. ఇటీవల ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూల్ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్ని తన కొడుకుతో కలిసి రాసింది. డి-గ్రేడ్‌తో పాసైంది.

news18-telugu
Updated: May 28, 2019, 11:15 AM IST
తల్లీకొడుకులు టెన్త్ ఒకేసారి పాసయ్యారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చదవాలన్న పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది ఒడిశాకు చెందిన ఓ మహిళ. 18 ఏళ్ల క్రితం ఆమె స్కూల్ డ్రాపవుట్. చదువు మధ్యలోనే మానేసింది. పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కుటుంబంతోనే సరిపోయింది. ఇక చదువు సాధ్యం కాలేదు. కానీ 18 ఏళ్ల తర్వాత తన కొడుకుతో కలిసి 10వ తరగతి పరీక్ష రాసింది. పాసైంది. ఇదీ ఆమె ఘనత. ఆమె పేరు బసంతి ముదుళీ. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో కర్లకోట గ్రామపంచాయతీలో ఓ మారుమూల గ్రామంలో ఉంటోంది. అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 36 ఏళ్లు. ఇటీవల ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూల్ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్ని తన కొడుకుతో కలిసి రాసింది. డి-గ్రేడ్‌తో పాసైంది.

నేను పదవ తరగతి పాస్ కాకపోవడం నన్నెంతగానో వేధించేది. ఎలాగైనా టెన్త్ పాసవ్వాలని అనుకున్నాను. టెన్త్ పాస్ కావడం వల్ల నాకు ఎలాంటి ప్రమోషన్ రాకపోవచ్చు. కానీ టెన్త్ పరీక్షల కోసం మా కొడుకు పుస్తకాలు చదివాను. పరీక్షలు రాశాను.

బసంతి ముదుళీ


ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూల్ బోర్డు ద్వారా కుడుముల్‌గుమ్మ హై స్కూల్‌లో పదవ తరగతిలో చేరింది బసంతి ముదుళీ. ఆమెకు టెన్త్ పరీక్షల్లో 203 మార్కులు వచ్చాయి. డి-గ్రేడ్‌తో పాసైంది. ఆమె కొడుకు శివానందకు 340 మార్కులు వచ్చాయి. సి-గ్రేడ్‌తో పాసయ్యాడు. బసంతికి భర్తతో పాటు కొడుకు సపోర్ట్ చాలా ఉంది. తన భార్యను ఇంకా చదివిస్తానని అంటున్నాడు ఆమె భర్త లాబా పట్నాయక్. ఆమెకు స్థానికులతో పాటు రాజకీయ నేతల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. స్థానికులకు బసంతి స్ఫూర్తిగా నిలుస్తోందని కొత్తగా ఎంపీగా గెలిచిన రమేష్ చంద్ర మాఝీ ప్రశంసించారు.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

Lock Aadhaar: ఎస్ఎంఎస్‌తో ఆధార్ లాక్ చేయొచ్చు ఇలా
First published: May 28, 2019, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading