ఏపీలో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

news18-telugu
Updated: May 9, 2020, 3:48 PM IST
ఏపీలో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించిన 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీపై చర్చించారు. ఒకసారి సంబంధిత శాఖకు పరీక్షల నిర్వహణకు అనుమతి వచ్చిన వెంటనే తాము ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు.  అయితే, అప్లికేషన్ ప్రక్రియను మరోసారి చేపట్టాలని కొందరు అభ్యర్థులు జీకే ద్వివేదీని కోరారు. జనవరిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల గడువు జనవరి 31తోనే ముగిసింది. అయితే, పరీక్షలు మాత్రం పెండింగ్‌లో పడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఎలాంటి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 9, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading