వివిధ రంగాల్లో పరిశోధనలను (Research) ప్రోత్సహించేందుకు అనేక ప్రైవేటు కంపెనీ(Private Companies) లు ముందుకు వస్తున్నాయి. దేశంలోని అనేక విద్యా సంస్థల్లో పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. తాజాగా శామ్సంగ్ (Samsung) కంపెనీ ఇలాంటి కార్యక్రమమే చేపట్టింది. తమ ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్ధులను పరిశోధనల్లో ప్రోత్సహించేందుకు శామ్సంగ్ ఇండియా (Samsung India) విభాగం ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుతోన్న విద్యార్థులను(Students) ఇందుకు ఎంచుకుంది. ఐఐటీ మద్రాస్(IIT Madras), ఐఐటీ గౌహతి(IIT-Guwahati) సంస్థల్లో చదువుకుంటున్న 130 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల(Engineering Students)కు ఫెలో పిప్ అందించనున్నారు. ట్రాఫిక్ లైట్లను మరింత సమర్థంగా నిర్వహించడం, క్యాన్సర్(Cancer) మందులపై పరిశోధనలు, విద్యుత్ వాహనాలు(Electric Vehicles), సోలార్ సెల్స్ లో లిక్విడ్ క్రిస్టల్స్‌పై ప్రయోగాలు చేసే విద్యార్థులకు ఈ ఫెలోషిప్ ఇవ్వనున్నారు.
ఎవరెవరు అర్హులు
బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, బీటెక్, ఎంటెక్ డ్యుయల్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, ఎంటెక్, ఎంఎస్ రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు ఈ ఫెలోషిప్‌కు అర్హులు. అండర్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.25,000 ఫెలోషిప్‌ను శామ్సంగ్ కంపెనీ అందిస్తోంది. కెమికల్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఓషన్, సీఎస్ఈ, ఇంజనీరింగ్ డిజైన్, సివిల్, మెటలర్జికల్, మెటీరియల్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుకుంటున్న 130 మందికి ఫెలోషిప్ అందిస్తున్నట్టు శామ్సంగ్ ఇనిస్టిట్యూట్ ఇండియా పరిశోధన, అభివృద్ధి ఢిల్లీ విభాగం ఎండీ ఢీకో కిమ్ తెలిపారు.
అట్టడుగు వర్గాల విద్యార్థులకు ప్రోత్సాహం
సమాజంలో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శామ్సంగ్ ఈ ప్రోగ్రామ్ చేపట్టింది. పరిశోధన ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఢీకో కిమ్ తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని ఐఐటీల్లో చదువుకుంటోన్న విద్యార్థులకు ఈ ఫెలో షిప్ అందించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు.
IIT Bombay: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నైపుణ్యాల కల్పనకు కోర్సులను ప్రారంభించిన ఐఐటీ బాంబే
గ్లోబల్ సిటిజన్ షిప్ ప్రోగ్రామ్
కంపెనీ గ్లోబల్ సిటిజన్‌షిప్ కార్యక్రమం ద్వారా వివిధ దేశాల విద్యార్థుల మధ్య కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఐవోటీ, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఏఆర్, వీఆర్ తో పాటు మరికొన్ని విభాగాల్లో వారి సామర్థ్యాల్లో వ్యత్యాసాలను తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ, కాన్పూర్, హైదరాబాద్, ఖరగ్‌పూర్, రూర్కీ, గౌహతి, జోధ్‌పూర్ ఐఐటీలతో పాటు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీల్లో 9 ఇన్నోవేషన్ క్యాంపస్ లను శామ్సంగ్ ఏర్పాటు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.