ప్రాణంతీసిన ఆన్‌లైన్ క్లాసులు... మొబైల్ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

ప్రభుత్వ స్కూళ్లు ఇంకా మొదలవ్వలేదు. ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించి... విద్యార్థులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. అసలా బాలిక ఎందుకు చనిపోయిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 24, 2020, 9:11 AM IST
ప్రాణంతీసిన ఆన్‌లైన్ క్లాసులు... మొబైల్ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య
ప్రాణంతీసిన ఆన్‌లైన్ క్లాసులు... మొబైల్ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య (File Image-ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ... కరీంనగర్... NTPC కృష్ణానగర్‌కి చెందిన 15 ఏళ్ల సింధుజ... పదో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా... ఆమె చదువుతున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించింది. సింధుజ... ఇంటిదగ్గరే ఉంటూ... తన తల్లి వాడుతున్న మొబైల్‌ ఫోన్‌లో ఉన్న ఇంటర్నెట్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేసి... దాని ద్వారా... టీవీలో ఇంటర్నెట్ వచ్చేలా చేసుకుంది. ఆన్‌లైన్ క్లాసుల్ని టీవీలో చూస్తూ నేర్చుకుంటోంది. ఐతే... తల్లికి ఏవైనా కాల్స్ వస్తే... గబుక్కున నెట్ కనెక్షన్ పోతోంది. ఇలా అప్పుడప్పుడూ జరుగుతోంది. దాంతో... సింధుజకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతోంది. అందువల్ల తల్లిని తనకు సొంతంగా ఓ మొబైల్ కొని ఇవ్వమని అడిగింది.

"సొంత మొబైల్ అంటే మాటలా... రూ.10 వేలు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి. అసలే డబ్బుల్లేవు. ఎలాగొలా ఎడ్జస్ట్ అవ్వాలి. ఇలా బలవంత పెట్టకూడదు" అని తల్లి చెప్పింది. సింధుజ బాగా ఫీలైపోయింది. ఈ సంవత్సరం తనకు సరిగా మార్కులు రావనీ, తాను చదువులో వెనకబడిపోతున్నానని తనలో తనే అనుకుంటూ... లోలోపల మదనపడుతూ... నెగెటివ్ ఆలోచనలు పెంచుకుంది.

తాజాగా తల్లి ఇంట్లో లేని సమయంలో... ఉరివేసుకొని చనిపోయింది. ఇలా ఆన్‌లైన్ క్లాసులు ఆ విద్యార్థిని ప్రాణాలు తీసినట్లైంది. చనిపోయిన కూతుర్ని చూసి... ఆ కుటుంబ సభ్యులు... విషాదంలో మునిగిపోగా... చుట్టుపక్కల వాళ్లు... అయ్యో పాపం... అని జాలిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు... అనుమానాస్పద మృతి కేసు రాసి... పాప మృతదేహాన్ని ఆస్పత్రికి పంపి పోస్ట్‌మార్టం జరిపించారు. రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామంటున్నారు.

ఈ ఆన్‌లైన్ క్లాసులు వచ్చాక... చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో మొబైల్, టాబ్లెట్ల వంటివి కొనాలంటే ఎక్కడ వీలవుతుందన్నది తల్లిదండ్రుల మాట. అసలు ఇంటర్నెట్ కనెక్షన్ ఎన్ని కుటుంబాలకు అందుబాటులో ఉందన్నది మరో ప్రశ్న. ఆన్‌లైన్ క్లాసులు పిల్లలకు అర్థమవుతున్నాయా అన్నది ఇంకో సమస్య. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ఇక తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? చదువులే ప్రాణాలు తీస్తే ఎలా?
Published by: Krishna Kumar N
First published: August 24, 2020, 9:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading