హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Agnipath: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు

Agnipath: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు

అగ్నిపథ్‌కు మహిళల ఆకర్షణ.. మూడ్రోజుల్లో పది వేల దరఖాస్తులు

అగ్నిపథ్‌కు మహిళల ఆకర్షణ.. మూడ్రోజుల్లో పది వేల దరఖాస్తులు

ఇండియన్ నేవీ అగ్నిపథ్ (Agnipath) రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను జూలై 1న ప్రారంభించింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోర్టల్‌ను ఓపెన్ చేసొన కొద్ది రోజుల్లోనే దాదాపు 10,000 మంది మహిళలు ఈ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

Agnipath: అగ్నిపథ్‌కు మహిళల హెవీ రెస్పాన్స్.. నేవీకి వేలల్లో దరఖాస్తులు.. మూడ్రోజుల్లో ఎన్ని అప్లికేషన్స్ అంటే..? సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ను (Agnipath) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీ (Indian Navy) అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ (Registration)ను జూలై 1న ప్రారంభించింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోర్టల్‌ను ఓపెన్ కొద్ది రోజుల్లోనే దాదాపు 10,000 మంది మహిళలు ఈ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం.. భారత నౌకాదళం అగ్నిపథ్ (Agnipath) రిక్రూట్‌మెంట్ పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 1న ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ల తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జులై 15 నుంచి జులై 30 వరకు కొనసాగనుంది.

నావికా దళం సెయిలర్ పోస్టులకు మహిళలను రిక్రూట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ అవసరాలకు అనుగుణంగా యుద్ధనౌకలపై మోహరించే ఫోర్స్‌లో సెయిలర్స్‌గా మహిళలను నియమించుకోవడానికి ఇండియన్ నేవీ ఇటీవల అనుమతించింది. అయితే 2022లో ప్రవేశపెట్టనున్న 3000 నేవీ 'అగ్నివీర్స్'లో మహిళల సంఖ్యను నేవీ ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం వరకు దాదాపు 10,000 మంది మహిళా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం రిక్రూట్ చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు ANI వార్తా సంస్థకు తెలిపారు.

ఇదీ చదవండి: యూజీసీ నెట్ అడ్వాన్స్‌డ్ సిటీ ఇన్టిమేషన్ స్లిప్స్ విడుదల.. ! రెండు పరీక్షలకు బదులుగా ఒకటే..! వివరాలు ఇవిగో ?


ఇండియన్ నేవీ నవంబర్ 21న భారత నావికాదళానికి చెందిన నావికుల కోసం శిక్షణ అందించేందుకు INS చిల్కా వద్ద ఏర్పాట్లు ప్రారంభించింది. మహిళా నావికులకు శిక్షణ ఇచ్చే సౌకర్యాలు కూడా ఈ సంస్థలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘నేవీలో అగ్నిపథ్ పథకం జెండర్ న్యూట్రల్‌గా ఉంటుంది. ప్రస్తుతం 30 మంది మహిళా అధికారులు ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలలో ప్రయాణిస్తున్నారు. మహిళా నావికులను కూడా నియమించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాం. ఇందులో మహిళలు కూడా ఉంటారు. వీరు విధుల్లో భాగంగా సముద్రంలో గస్తీకి వెళ్తారు.’ అని నేవీ అధికారులు పేర్కొన్నారు.

సాయుధ బలగాలు 1990ల నుంచి సైనిక దళాల్లో మహిళలను చేర్చుకుంటున్నాయి, కానీ కేవలం అధికారి హోదాలో (officer ranks) మాత్రమే ఈ నియామకాలు ఉండేవి. 2019-20లో ఈ నియమాలను మార్చారు. భారత సైన్యం మొదటిసారి ఇతర ర్యాంకుల్లో మహిళలను నియమించుకోవడం ప్రారంభించింది. ఫలితంగా 100 మంది మహిళా జవాన్లు ప్రస్తుతం కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP)గా సేవలు అందిస్తున్నారు.

జూన్ 14న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో నియామకాలు చేపడతామని ప్రకటించారు. త్రివిధ దళాధిపతుల సమక్షంలో కేంద్రమంత్రి ఈ ప్రకటన చేశారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉండే యువకులను ఈ స్కీమ్ ద్వారా సాయుధ సేవల్లోకి రిక్రూట్‌ చేసుకుంటామని వెల్లడించారు. ఎంపికైన అగ్నివీరుల సర్వీస్ పీరియడ్ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు సేవల్లో కొనసాగిస్తామని నిబంధనలు ఉన్నాయి. అయితే తదనంతర పరిస్థితుల్లో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ కోసం ఈసారి గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది. ఈ పథకం కింద ఎంపికైన యువతను ‘అగ్నివీర్లు’ అని పిలుస్తారు. ఈ ఏడాది 46,000 మంది అగ్నివీరులను రిక్రూట్‌ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

First published:

Tags: Agnipath Scheme, Army jobs, Indian Navy, JOBS