యుజ్వేంద్ర చాహల్..! చూడటానికి బక్కపలచగా ఉంటాడు. కానీ స్పిన్‌తో బంతిని తిప్పితే.. అవతల ఎంతటి బ్యాట్స్‌మెన్ ఉన్నాబోల్తా కొట్టాల్సిందే. కన్ప్యూజన్లో వికెట్ సమర్పించుకోవాల్సిందే. ఐపీఎల్ 2020 టోర్నీలోనూ అద్భుతంగా రాణించాడు చాహల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించిన అతడు.. పలు మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే ఈ ఏడాది లాక్డౌన్లో ధనశ్రీ వర్మ అనే యువతితో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చాడు. తాజాగా తమ లవ్ స్టోరీ గురించి ఆర్సీబీ ఇన్సైడర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భార్య ధనశ్రీతో కలిసి ప్రేమ గాధను వివరించాడు.
''చిన్నప్పటి నుంచీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. భాంగ్రాతో పాటు పలు నృత్యాలను నేర్చుకోవాలని ఆశ ఉండేది. ఆ కోరికతోనే ఓ డ్యాన్స్ స్కూల్ చేరా. అక్కడే ధనశ్రీ పరిచయమయింది. ఆమె డాన్స్ టీచర్. మాకు డాన్స్ పాఠాలు నేర్పించేంది. అలా మా ఇద్దరి పరిచయం తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. ఒకరి గురించి మరొకరం పూర్తిగా తెలుసుకున్నాక.. రెండున్నర నెలల తర్వాత ఇంట్లో చెప్పాం. ధనశ్రీని పెళ్లి చేసుకుంటానని మా తల్లిందండ్రులకు చెప్పా. అలా మా పెళ్లి జరిగిపోయింది.'' అని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు.
డాన్స్ విషయంలో యుజ్వేంద్ర చాహల్‌కు 10కి 7 మార్కులు వేసింది అతడి డాన్స్ టీచర్ ధనశ్రీ. యుజ్జీ నిజాయతీపరుడు, కష్టజీవి అని ప్రశంసించింది. ఆగస్టు 8న ధనశ్రీతో యుజ్వేంద్ర చాాహల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో 15 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు చాహల్. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్ర్కమించి ఇంటి బాటపట్టింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.