• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • YUVRAJ SINGH PRAY FOR TELANGANA STATE OVER HEAVY RAINS SA

తెలంగాణ ప్రజల కోసం ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా: యువరాజ్‌

తెలంగాణ ప్రజల కోసం ఆ దేవున్ని  ప్రార్థిస్తున్నా: యువరాజ్‌

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జన జీవనం ఎలా అతలాకుతలమైందో చూశాం. బంగాళాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుశాయి.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జన జీవనం ఎలా అతలాకుతలమైందో చూశాం. బంగాళాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుశాయి.

  • Share this:


    గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జన జీవనం ఎలా అతలాకుతలమైందో చూశాం. బంగాళాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరద ప్రభావం కనిబడింది. 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునగడంతో 2 వేల కోట్లు నష్టం వాటిల్లింది. 1916 తర్వాత హైదరాబాద్‌లో 31 సెం.మీ వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాల కారణంగా 11 మంది మృతిచెందగా.. హైదరాబాద్‌లోని 72 ప్రాంతాల్లో 144 కాలనీలలు వరద నీటీలో చిక్కుకున్నాయి. దాదాపు గ్రేటర్ పరిధిలో దాదాపు 35 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి.

    ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు చాలా ప్రముఖులు ముందుకువస్తున్నారు సోషల్‌ మీడియాలో వేదికగా వర్షా ప్రభావంపై స్వందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ట్విటర్‌ వేదికగా స్పందించాడు.
    భారీ వర్షాల కారణంగా తెలంగాణ అతలకూతలమైంది. చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. అయితే జరిగిన నష్టం పరిమితంగానే ఉంది. వరద ప్రాంతాలలో చిక్కుకున్న వారి కోసం కార్మికులు శ్రమిస్తున్నారు. ఈ విలయంలో మరణించిన వారికి,వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
    తొందరగా తెలంగాణ ఈ వర్ష బీభత్సవం నుంచి బయటపడాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నాను. ' అని యువరాజ్‌ సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.





    కాస్త వర్ఫాలు తగ్గడంతో ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు చెపట్టాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని పునరవాసం ఏర్పాలు చేస్తున్నాయి. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువుల కట్టలు తెగాయని, 7.35 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరంపై అధికారులతో కలిసి చర్చించారు.  ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌ వ్వాప్తంగా 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. దాదాపు లక్షా 10 వేల మందికి భోజన వసతి కల్పించినట్లు వెల్లడించారు. తక్షణ సహయం కోసం జీహెచ్‌ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేశామని.. రూ.1350 కోట్లు సహాయాన్ని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోరినట్లు కేసీఆర్ వెల్లడించారు.
    Published by:Rekulapally Saichand
    First published: