నేలకొరిగిన క్రీడా శిఖరం.. తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం

డబ్ల్యూడబ్ల్యూ దిగ్గజం ప్రొఫెషనల్ రెజ్లర్ జేమ్స్ హరిస్(70) కన్నుమూశారు. అభిమానులు "కమాలా" అని ముద్దుగా పిలిచే ఈ మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ అదివారం తుదిశ్వాస విడిచారు.

Rekulapally Saichand
Updated: August 10, 2020, 6:22 PM IST
నేలకొరిగిన  క్రీడా శిఖరం..  తీవ్ర దిగ్భ్రాంతిలో  క్రీడాలోకం
james-harris
  • Share this:
డబ్ల్యూడబ్ల్యూ దిగ్గజం ప్రొఫెషనల్ రెజ్లర్ జేమ్స్ హరిస్(70) కన్నుమూశారు. అభిమానులు "కమాలా" అని ముద్దుగా పిలిచే ఈ మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ అదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమాన లోకం శోకసంధ్రంలో మునిగిపోయారు. డబ్ల్యూడబ్ల్యూతో ఫ్యాన్స్‌ను అలరించిన జేమ్స్బఇక లేరు అనే వార్త క్రీడా ప్రపంచాన్ని తీవ్రద్రిగ్భ్రాంతిలో ముంచేపింది. 6 అడుగుల 7 ఇంచుల భారీ కాయం కలిగియిండి వికృత రూపంతో భీకరంగా పోరాడేవాడు. రెజ్లింగ్‌ హీరోలైన అండ్రూ ది గేయింట్, హల్క్ హోగన్‌, అండర్ టేకర్‌లతో చేసిన ఫైట్ అభిమానులను టీవీలకు కట్టిపడేసింది.

2006లో రెజ్లర్‌కి గుడ్ బై చేప్పిన జేమ్స్ హరిస్ ఇప్పటీవరకు 400 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాడు. 6 అడుగుల 7 ఇంచుల భారీ అకృతితో ప్రత్యర్ధులను రింగ్ దిగకుండానే ప్రతర్ధులకు దడ పుట్టించేవాడు. 1993లో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు కమాలా. చివరిసారిగా 2006 రింగ్‌లో కనిపించాడు. అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యలతో డబ్ల్యూడబ్ల్యూకి దూరమయ్యాడు. ఆ క్రమంలోనే అతని కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ముఖానికి రంగులు పూసుకొని వికృత అకారంతో భయకరంగా కనిపించే జేమ్స్ హరిస్ .. అండర్ టేకర్, అండ్రూ ది గేయింట్, హల్క్ హోగన్‌లతో తలపడిన తీరు అభిమానులను టీవీలకు అలానే కట్టిపడేసేది. ఇక కమలా మరణం అతని ఫ్యాన్స్‌ని తీవ్ర విచారంలోకి నెట్టింది.
Published by: Rekulapally Saichand
First published: August 10, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading