Home /News /ipl /

Womens T20 Challenge: మిథాలి వర్సెస్ హర్మన్‌ప్రీత్.. తొలి పోరులో గెలుపెవరిది?

Womens T20 Challenge: మిథాలి వర్సెస్ హర్మన్‌ప్రీత్.. తొలి పోరులో గెలుపెవరిది?

హర్మన్‌ప్రీత్ సింగ్, మిథాలి రాజ్ (Image:IPL)

హర్మన్‌ప్రీత్ సింగ్, మిథాలి రాజ్ (Image:IPL)

Womens T20 Challenge: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత క్రీడాకారినులు మైదానంలోకి దిగనున్నారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.

    మహిళల పొట్టి క్రికెట్ (మహిళల ఐపీఎల్) సంబంరం మొదలయింది. యూఏఈ వేదికగా ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ మూడో సీజన్ ప్రారంభమైంది. షార్జాలో జరుగుతున్న తొలి పోరులో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇవాళ్టి నుంచి నవంబరు 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. గత రెండు సీజన్లలోనూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని నొవాస్‌ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉంది. మిగతా జట్లు కూడా టైటిల్ గెలుస్తామని ధీమాతో ఉన్నాయి.


    Supernovas (Playing XI): ప్రియా పునియా, చమారి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), శశికళ సిరివర్దనే, తానియా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, షకీరా సెల్మాన్, అయబొంగా ఖాకా.

    Velocity (Playing XI): షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలి రాజ్ (కెప్టెన్), వేదా క్రిష్ణమూర్తి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), సూనే లూస్, మనాలి దక్షిణి, శిఖా పాండే, ఏక్తా బిష్ట్, లీఫ్ కాస్పెరిక్, జహానర ఆలమ్.



    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతుంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత క్రీడాకారినులు మైదానంలోకి దిగనున్నారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు. ఇక అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ ఈ టోర్నీలో ఎలా ఆడుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Women's Cricket

    తదుపరి వార్తలు