Home /News /ipl /

Womens T20 Challenge: తొలి మ్యాచ్‌లో మిథాలి రాజ్ సేన ఘన విజయం

Womens T20 Challenge: తొలి మ్యాచ్‌లో మిథాలి రాజ్ సేన ఘన విజయం

Womens T20 Challenge: తొలి మ్యాచ్‌లో మిథాలి రాజ్ సేన ఘన విజయం

Womens T20 Challenge: తొలి మ్యాచ్‌లో మిథాలి రాజ్ సేన ఘన విజయం

షార్జాలో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌ (Supernovas)పై ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో.. 5 వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ సేనను ఓడించింది.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 టోర్నీలో మిథాలి రాజ్ సేన వెలాసిటీ (Velocity) శుభారంభం చేసింది. షార్జాలో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌ (Supernovas)పై ఘన విజయం సాధించింది.  ఆఖరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో.. 5 వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ సేనను ఓడించింది. 127 పరులు లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది వెలాసిటీ జట్టు. సునె లుస్ 37, సుష్మా వర్మ 34, వేదా కృష్ణమూర్తి 29 పరుగులతో రాణించారు. మిథాలి సేన మొదట్లో ఇబ్బందులు పడింది. తొలి ఓవర్‌లోనే వ్యాట్ (0) వికెట్ కోల్పోయింది.

    ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే షఫాలి వర్మ (17),  మిథాలి రాజ్ (7) వికెట్లు పడ్డాయి.  అనంతరం వేద, సుష్మ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆచితూచి ఆడుతూ స్కోర్‌‌ను ముందుకు తీసుకెళ్లారు. 65 పరుగుల వద్ద వేద ఔటైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లుస్.. సుష్మతో కలిసి ధాటిగా ఆడింది. 19 ఓవర్ల సుష్మ ఔటయింది. మ్యాచ్ ఉత్కంఠగా మారిన తరుణంలో ఫోర్ కొట్టి వెలాసిటీ టీమ్‌ను గెలిపించింది లుస్. సూపర్ నోవాస్ బౌలర్లలో  ఖాక రెండు వికెట్లు తీసింది. రాధా, పూనమ్, శశికళ తలో వికెట్ పడగొట్టారు.

    అంతకు ముందు.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్  చమారి ఆటపట్టు అదరగొట్టింది. 39 బంతుల్లో 44 పరుగులు చేసింది.  ఇందులో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా బాధ్యతాయుత ఇన్సింగ్ ఆడింది. 27 బంతుల్లో 37 రన్స్ చేసింది. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్ ఉన్నాయి.

    ప్రియా పునియా 11, జెమీమా రోడ్రిగ్స్ 7, శశికల సిరివర్దనే 31, పూజా వస్త్రాకర్ 0, రాధా యాదవ్ 2, షకీరా సల్మాన్ 5 పరుగులు మాత్రమే చేశారు. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ అద్భుతగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. జహానర ఆలం, లీహ్ కాస్పెరిక్ చెరో రెండు వికెట్లు సాధించారు.

    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతోంది.  నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత క్రీడాకారినులు మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Women's Cricket, Women’s T20 Challenge 2020

    తదుపరి వార్తలు