Home /News /ipl /

WOMENS T20 CHALLENGE SHIKHA PANDEY THIS INDIAN WOMEN CRICKETER IS IAF OFFICER SK

Womens T20 Challenge: ఈ మహిళా క్రికెటర్.. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని తెలుసా..?

శిఖా పాండే

శిఖా పాండే

Womens T20 Challenge: శిఖా పాండే కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్..! శిఖా పాండే IAFలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

    యూఏఈ వేదికగా మహిళల టీ20 చాలెంజ్ (మహిళల ఐపీఎల్) ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 9 వరకు షార్జా స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్  జట్లు పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి భారత క్రీడాకారినులు మైదానంలోకి దిగనున్నారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌ క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.

    శిఖా పాండే


    ఐతే వెలాసిటీ జట్టు బౌలర్ శిఖా పాండే గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈమె కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్..! శిఖా పాండే IAFలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వాయుసేన అధికారిణిగా దేశానికి సేవలందిస్తూనే.. మరోవైపు మహిళా క్రికెట్‌లో రాణిస్తోంది. 2010లో గోవా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేసిన శిఖా పాండేకు ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. కానీ ఆమె మాత్రం క్రికెట్‌పై ఫోకస్ పెట్టారు. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరి.. 2012లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా బాధ్యతలు చేపట్టారు.

    womens t20 challenge, women ipl,shikha pandey,cricket news,sports telugu news,శిఖా పాండే, ఉమెన్స్ టీ20 ఛాలెంజ్,
    శిఖా పాండే


    2014తో భారత మహిళా జట్టులో చోటు సంపాదించింది శిఖా పాండే. 2014, మార్చి 9న బంగ్లాదేశ్ జట్టుపై తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. శిఖా పాండే ఇప్పటి వరకు 2 టెస్ట్‌లు, 52 వన్డే మ్యాచ్‌లు, 46 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వన్డేల్లో 2,340, టీ20ల్లో 623, టెస్టుల్లో 159 పరుగులు చేసింది. ఇక వన్డేల్లో 73, టీ20ల్లో 29, టెస్ట్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది శిఖా పాండే. ప్రస్తుతం ఉమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో వెలాసిటీ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది శిఖా పాండే.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు