Home /News /ipl /

WOMENS T20 CHALLENGE 2020 VELOCITY VS TRAILBLAZERS SMRII MANDHANA TEAM WON BY 9 WICKETS SK

Velocity vs Trailblazers: అదరగొట్టిన డాటిన్.. స్మృతి సేన ఈజీ విక్టరీ

ట్రైల్‌బ్లేజర్స్ విజయం (Image:IPL)

ట్రైల్‌బ్లేజర్స్ విజయం (Image:IPL)

Womens T20 Challenge: టోర్నీ మొదటి మ్యాచ్‌లో వెలాసిటీ గెలవగా.. రెండో మ్యాచ్‌లో వెలాసిటీని ఓడించింది ట్రైల్ బ్లేజర్స్ టీమ్.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020 రెండో మ్యాచ్‌లో  ట్రైల్ బ్లేజర్స్ అదరగొట్టింది.  ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో.. అద్భుత ప్రదర్శన కనబరిచి.. వెలాసిటీ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 48 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే చేధించింది.  ట్రైల్ బ్లేజర్స్ ఓపెనర్ డాటిన్ 29 పరుగులతో రాణిచింది. కెప్టెన్ స్మ‌ృతి మంధన తక్కువ పరుగులకే ఔటయినప్పటికీ.. తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చింది డాటిన్.  ఎనిమిదో ఓవర్ ఐదో బంతిని రిచా ఘోష్ సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో వెలాసిటీ గెలవగా.. రెండో మ్యాచ్‌లో వెలాసిటీని ఓడించింది ట్రైల్ బ్లేజర్స్ టీమ్.

    టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టు 14.5  ఓవర్లలో 46 పరుగులు చేసి ఆలౌటయింది. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్ ఎకిల్‌స్టోన్ దెబ్బకు వెలాసిటీ బ్యాటర్స్ విలవిల్లాడారు. ఏడు మంది సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశారు. ఎవరూ కూడా బాధ్యతాయుత ఇన్సింగ్స్ ఆడలేదు. 10 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయారంటే వెలాసిటీ బ్యాటర్స్ ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు.

    స్టార్ బ్యాట్స్‌ఉమెన్ షఫాలి వర్మ మరోసారి విఫలమైంది.  కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన  సుష్మా వర్మ, లుస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వెలాసిటీ బ్యాటర్స్‌లో.. డేనియల్ వ్యాట్ 3, మిథాలి రాజ్ 1, వేద క్రిష్ణమూర్తి 0, సుష్మా వర్మ 1, సూనె లుస్ 4, శిఖా పాండే 10, సుశ్రీ దిబ్యదర్శిని 0, లీహ్ కాస్పిరెక్ 11 నాటౌట్, ఏక్తా బిష్క్ 0, జహానరా ఆలమ్ 1 పరుగులు చేశారు.

    ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3.1 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. ఇక జులన్ గోసామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది.

    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ మూడో సీజన్ జరుగుతోంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Trailblazers, Velocity, Women's Cricket, Women’s T20 Challenge 2020

    తదుపరి వార్తలు