Home /News /ipl /

WOMENS T20 CHALLENGE 2020 VELOCITY VS TRAILBLAZERS MITHALI RAJ WON TOSS OPT TO BAT SK

Velocity vs Trailblazers: స్మృతి వర్సెస్ మిథాలి.. టాస్ గెలిచిన వెలాసిటీ

Womens T20 Challenge: వెలాసిటీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మనాలి దక్షిణి స్థానంలో సుశ్రీ దిబ్యదర్శిణిని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో ట్రైల్ బ్లేజర్స్‌కు ఇదే తొలి మ్యాచ్.

Womens T20 Challenge: వెలాసిటీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మనాలి దక్షిణి స్థానంలో సుశ్రీ దిబ్యదర్శిణిని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో ట్రైల్ బ్లేజర్స్‌కు ఇదే తొలి మ్యాచ్.

Womens T20 Challenge: వెలాసిటీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మనాలి దక్షిణి స్థానంలో సుశ్రీ దిబ్యదర్శిణిని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో ట్రైల్ బ్లేజర్స్‌కు ఇదే తొలి మ్యాచ్.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020లో ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోది. షార్జా వేదికగా తొలి పోరులో స్మతి మంధన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్, మిథాలి రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో సూపర్‌నోవాస్ జట్టుపై విజయం సాధించింది మిథాలి సేన. ఇవాళ ట్రైల్‌బ్లేజర్స్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలిరాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వెలాసిటీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మనాలి దక్షిణి స్థానంలో సుశ్రీ దిబ్యదర్శిణిని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో ట్రైల్ బ్లేజర్స్‌కు ఇదే తొలి మ్యాచ్.



    జట్ల వివరాలు:

    Velocity (Playing XI): షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలి రాజ్ (కెప్టెన్), వేదా క్రిష్ణమూర్తి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), సూనే లూస్, శిఖా పాండే, సుశ్రీ దిమ్యదర్శిణిని, ఏక్తా బిష్త్, లీహ్ కాస్పెరిక్, జహానర ఆలమ్.

    Trailblazers (Playing XI): స్మృతి మంధన (కెప్టెన్), డీండ్రా డాటిన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హెర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దయాలన్ హేమలత, నట్టకన్ చంతన్, సల్మా ఖుతాన్, సోఫీ ఎకిల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోసామి.


    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ మూడో సీజన్ జరుగుతోంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Trailblazers, Velocity, Women's Cricket, Women’s T20 Challenge 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు