Home /News /ipl /

WOMENS T20 CHALLENGE 2020 TRAILBLAZERS VS SUPERNOVAS HARMAN WON THE TOSS OPT TO BAT SK

Trailblazers vs Supernovas: టాస్ గెలిచిన హర్మన్.. సూపర్‌నోవాస్‌కి చావో రేవో..

హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన (Image:IPL)

హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన (Image:IPL)

Trailblazers vs Supernovas: ట్రైల్ బ్లేజర్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. సూపర్ నోవాస్ మాత్రం ఒక మార్పు చేసింది. పూజా వస్త్రాకర్ స్థానంలో అనూజ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020లో ఇవాళ మూడో మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదికగా  స్మతి మంధన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్, హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ తలపడుతున్నాయి. ఈ టోర్నీ ఇప్పటికే ఓ విజయం సాధించింది ట్రైల్ బ్లేజర్స్. ఇక ఆడిన తొలిన మ్యాచ్‌లో సూపర్ నోవాస్ ఓడిపోయింది. ఇవాళ గెలిస్తేనే ఫైనల్ రేస్‌లో ఉంటుంది లేదంటే ఇంటికి వెళ్తుంది. ఇలాంటి కీలక మ్యాచ్లో సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రైల్ బ్లేజర్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. సూపర్ నోవాస్ మాత్రం ఒక మార్పు చేసింది. పూజా వస్త్రాకర్ స్థానంలో అనూజ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

    జట్ల వివరాలు:

    Trailblazers (Playing XI): స్మృతి మంధన (కెప్టెన్), డీండ్రా డాటిన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హెర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దయాలన్ హేమలత, నట్టకన్ చంతన్, సల్మా ఖుతాన్, సోఫీ ఎకిల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోసామి.

    Supernovas (Playing XI): ప్రియా పునియా, చమారి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), శశికళ సిరివర్దనే, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, అనూజ పాటిల్, షకీరా సెల్మాన్, పూనమ్ యాదవ్, అయబొంగా ఖాకా.

    ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడిన ట్రైల్‌బ్లేజర్స్ ఆ మ్యాచ్లో గెలిచింది. 2 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచ్‌లు ఆడిన వెలాసిటీ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒక మ్యాచ్ ఆడిన సూపర్ నోవాస్ అందులో ఓడిపోయి.. మూడో స్థానంలో నిలిచింది.

    యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ మూడో సీజన్ జరుగుతోంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో.. మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Supernovas, Trailblazers, Velocity, Women's Cricket, Women’s T20 Challenge 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు