Home /News /ipl /

WOMENS T20 CHALLENGE 2020 TRAILBLAZERS VS SUPERNOVAS HARMAN TEAM WON THE MATCH SK

Womens T20 Challenge: గెలిచి నిలిచిన SNO.. ఫైనల్‌లో TBLతో ఢీ

సూపర్ నోవాస్ విజయం

సూపర్ నోవాస్ విజయం

Womens T20 Challenge: మూడు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో TBL, SNO మొదటి రెండు స్థానాల్లో నిలవడంతో.. ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లాయి.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020 మూడో మ్యాచ్‌లో సూపర్ నోవాస్ (Supernovas) టీమ్ విజయం సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో.. ఉత్కంఠ మధ్య.. ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers) జట్టును ఓడించి.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో సూపర్ నోవాస్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మూడు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో TBL, SNO మొదటి రెండు స్థానాల్లో నిలవడంతో.. ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లాయి. నవంబరు 9న షార్జాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.


    147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రైల్ బ్లేజర్స్ టీమ్.. 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీప్తి శర్మ 43 పరుగుల అద్భుతంగా ఆడి నాటౌట్‌గా నిలిచింది. స్మృతి మంధన 33, డాటిన్ 27, హర్లీన్ డియోల్ 27 పరుగులతో రాణించారు. భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ట్రైల్ బ్లేజర్స్‌కు ఓపెనర్లు డాటిన్, స్మృతి మంధన శుభారంభమే ఇచ్చారు. డాటిన్ ఐతే రెచ్చిపోయిది ఆడింది. 15 బంతుల్లోనే 27 రన్స్ చేసింది. ఏడో ఓవర్‌లో డాటిన్‌తో పాటు రిచా ఘోష్ వెంట వెంటనే ఔట్ కావడంతో ట్రైల్‌బ్లేజర్స్‌కు దెబ్బపడింది.

    అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తితో కలిసి స్మృతి ఇన్నింగ్స్ మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేసింది. ఐతే 13 ఓవర్లలో స్మృతి మంధన, 15 ఓవర్లో హేమలత పెవిలియన్ చేరారు. చివర్లో దీప్తి, హర్లీన్ బాగానే ఆడినప్పటికీ.. అప్పటికే కావాల్సిన రన్‌రేట్ పెరగడంతో.. జట్టును గెలిపించలేకపోయారు. 2 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 10 కావాల్సిన వేళ 7 మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ తీయడంతో.. ట్రైల్ ప్లేజర్స్ పరాజయం పాలయింది. సూపర్‌నోవాస్ బౌలింగ్‌లో రాధా యాదవ్ 2, షకీరా సల్మాన్ 2, అనూజ పాటిల్ ఒక వికెట్ తీశారు.

    టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ సేన.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సూపర్‌నోవాస్ బ్యాటర్ చమారి ఆటపట్టు.. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లను ఆటాడుకుంది. సిక్స్‌లు ఫోర్లతో విరుచుకుపడింది. 48 బంతుల్లో 67 పరుగులు చేసి.. జట్టుకు భారీ స్కోర్ అందించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 31, ప్రియా పునియా 30 పరుగులతో రాణించారు.

    సూపర్ నోవాస్ జట్టుకు ఓపెనర్లు ప్రియా పునియా, ఆటపట్టు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. 12వ ఓవర్లలో సల్మా ఖాతున్ బౌలింగ్‌లో పునియా ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్‌తో కలిసి ధాటిగా ఆడింది ఆటపట్టు. 17వ ఓవర్లలో ఆటపట్టు ఔట్ అయిన తర్వాత.. వరుసగా వికెట్లు పడ్డాయి. ఐనప్పటికీ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఐతే 18 ఓవర్లో రోడ్రిగ్స్.. 20 ఓవర్లో సిరివర్దనే, హర్మన్‌ప్రీత్, అంజునా పాటిల్ ఔటయ్యారు. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో గోస్వామి, సల్మా ఖాతున్, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.

    యూఏఈలోని షార్జా వేదికగా నవంబరు 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరుగుతోంది. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Supernovas, Trailblazers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు