Home /News /ipl /

Trailblazers vs Supernovas: అల్లాడించిన ఆటపట్టు.. సూపర్‌నోవాస్ భారీ స్కోర్

Trailblazers vs Supernovas: అల్లాడించిన ఆటపట్టు.. సూపర్‌నోవాస్ భారీ స్కోర్

చమారి ఆటపట్టు (Image;IPL)

చమారి ఆటపట్టు (Image;IPL)

Trailblazers vs Supernovas: టోర్నీలో ఒక మ్యాచ్ ఆడిన సూపర్ నోవాస్ అందులో ఓడిపోయి.. మూడో స్థానంలో నిలిచింది. ఇవాళ గెలిస్తేనే ఫైనల్ రేస్‌లో ఉంటుంది లేదంటే ఇంటికి వెళ్తుంది.

    Womens T20 Challenge: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీ 2020లో ఇవాళ మూడో మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదికగా స్మృతి మంధన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్ (Trailblazers), హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ (Supernovas) తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ సేన.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సూపర్‌నోవాస్ బ్యాటర్ చమారి ఆటపట్టు.. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లను ఆటాడుకుంది. సిక్స్‌లు ఫోర్లతో విరుచుకుపడింది. 48 బంతుల్లో 67 పరుగులు చేసి.. జట్టుకు భారీ స్కోర్ అందించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 31, ప్రియా పునియా 30 పరుగులతో రాణించారు.

    సూపర్ నోవాస్ జట్టుకు ఓపెనర్లు ప్రియా పునియా, ఆటపట్టు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. 12వ ఓవర్లలో సల్మా ఖాతున్ బౌలింగ్‌లో పునియా ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్‌తో కలిసి ధాటిగా ఆడింది ఆటపట్టు. 17వ ఓవర్లలో ఆటపట్టు ఔట్ అయిన తర్వాత.. వరుసగా వికెట్లు పడ్డాయి. ఐనప్పటికీ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఐతే 18 ఓవర్లో రోడ్రిగ్స్.. 20 ఓవర్లో సిరివర్దనే, హర్మన్‌ప్రీత్, అంజునా పాటిల్ ఔటయ్యారు. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో గోస్వామి, సల్మా ఖాతున్, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.

    ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడిన ట్రైల్‌బ్లేజర్స్ ఆ మ్యాచ్లో గెలిచింది. 2 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచ్‌లు ఆడిన వెలాసిటీ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒక మ్యాచ్ ఆడిన సూపర్ నోవాస్ అందులో ఓడిపోయి.. మూడో స్థానంలో నిలిచింది. ఇవాళ గెలిస్తేనే ఫైనల్ రేస్‌లో ఉంటుంది లేదంటే ఇంటికి వెళ్తుంది.

    యూఏఈలోని షార్జా వేదికగా నవంబరు 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరుగుతోంది. ఇందులో సూపర్‌‌నోవాస్, వెలాసిటీ, ట్రైల్‌బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత క్రీడాకారిణులు ఆడుతున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత అమ్మాయిలతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌‌తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Supernovas, Trailblazers, Women's Cricket, Women’s T20 Challenge 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు