Home /News /ipl /

WOMENS T20 CHALLENGE 2020 FINAL TRAILBLAZERS VS SUPERNOVAS SMRITI TEAM SCORES 118 SK

TRL vs SPN, Womens T20 Challenge Final: స్మృతి క్లాస్ ఇన్సింగ్స్.. 5 వికెట్లతో రాధా మ్యాజిక్

స్మృతి మంధన (Image:IPL)

స్మృతి మంధన (Image:IPL)

Womens T20 Challenge 2020, Final: సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ రెచ్చిపోయింది. అద్భుతమమైన స్పెల్‌తో ట్రైల్ బ్లేజర్స్‌ను దెబ్బకొట్టింది. 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు పడగొట్టింది రాధా.

    Womens T20 Challenge 2020, Final: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్) టోర్నీలో ఇవాళ ఆఖరి పోరు జరుగుతోంది. షార్జా వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధన నేతృత్వంలోని ట్రైల్‌బ్లేజర్స్, హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ట్రైల్ బ్లేజర్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన క్లాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 49 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డియాండ్రా డాటిన్ 20 , రిచా ఘోష్ 10 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్స్ ఎవరూ రాణించలేదు. సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీప్తి శర్మ 9, హర్లీన్ డియోల్ 4, సోఫీ ఎకిల్‌స్టన్ 1, జులన్ గోస్వామి 1, చంతమ్ 0 రన్స్‌తో అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

    మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ బ్లేజర్స్‌కు డాటిన్, స్మతి మంధన అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ స్కోర్ సాధించేలా కనిపించారు. కానీ 12వ ఓవర్లో డాటిన్ ఔట్ అయింది. అనంతరం వచ్చిన రిచా ఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది స్మృతి మంధన. చూడచక్కని షాట్స్‌ ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇదే దూకుడు కొనసాగిస్తే స్మృతి సెంచరీ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఐతే15వ ఓవర్లో స్టంపౌట్ రూపంలో వికెట్ల ముందు దొరికిపోయింది. స్మృతి ఔటౌన తర్వాత.. ట్రైల్ బ్లేజర్స్ టీమ్ స్కోర్ పూర్తిగా పడిపోయింది. సూపర్ నోవాస్ బౌలర్ రాధా ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. బ్యాటర్స్ అంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. 6 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయిందంటే.. రాధా ఎంతగా దెబ్బకొట్టిందో అర్ధం చేసుకోవచ్చు. చివరి ఐదు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేయలగలిగారు ట్రైల్ బ్లేజర్స్. రాధా యాదవ్ అద్భుతమైన బౌలింగ్‌తో స్మృతి గ్యాంగ్‌ను కట్టడి చేయగలిగింది.

    ఇక సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ రెచ్చిపోయింది. అద్భుతమమైన స్పెల్‌తో ట్రైల్ బ్లేజర్స్‌ను దెబ్బకొట్టింది. 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు పడగొట్టింది రాధా. పూనమ్ యాదవ్, శశికళ సిరివర్దనేకు తలో వికెట్ దక్కాయి.

    ఈ టోర్నీలో ఇంతకు ముందు... రెండేసి మ్యాచ్‌లు ఆడిన మూడు జట్లు.. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా ట్రైల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ ఫైనల్‌కు చేరుకున్నాయి. మిథాలి రాజ్ నేతృత్వలోని వెలాసిటీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల టీఛాలెంజ్‌లో ఇది మూడో సీజన్. తొలి రెండు సీజన్‌లో హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. సూపర్‌నవాస్ జట్టే మరోసారి కప్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా? లేదంటే ట్రైల్ బ్లేజర్స్ గెలిచి తొలిసారి కప్ అందుకుంటారా? అనేది చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Supernovas, Trailblazers, Women's Cricket, Women’s T20 Challenge 2020

    తదుపరి వార్తలు