ఐపీఎల్ 2020

  • associate partner

Riana Lalwani: 'సూపర్ ఓవర్ బ్యూటీ'.. కళ్లన్నీ ఈమెపైనే.. ఎవరీ రియానా?

Riana Lalwani: మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని.. అందరూ ఉత్కంఠగా ఎదరు చూస్తున్న వేళ.. టీవీ స్క్రీన్‌పై ఓ అందమైన పిల్ల మెరిసింది. మత్తెక్కించే కళ్లతో.. గోళ్లు కొరుకుతూ దర్శనమిచ్చింది. పంజాబ్ జట్టును ఎంకరేజ్ చేస్తూ సందడి చేసింది.

news18-telugu
Updated: October 21, 2020, 4:50 PM IST
Riana Lalwani: 'సూపర్ ఓవర్ బ్యూటీ'.. కళ్లన్నీ ఈమెపైనే.. ఎవరీ రియానా?
రియానా (Image:twitter)
  • Share this:
ఆదివారం దుబయ్‌లో ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుంది కదా..! అప్పుడే ఎలా మర్చిపోతారు. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ అది. అభిమానులకు అసలు సిసలైన వినోదాన్ని అందించిన మ్యాచ్ అది. నరాలు తెగే ఉత్కంఠతో... చేతి గోళ్లన్నీ కొరికేసేలా చేసింది. మ్యాచ్ టై అయిందని.. సూపర్ ఓవర్ పెడితే.. ఆ సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఐతే రెండో సూపర్‌ ఓవర్‌లో గేల్, మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడడంతో.. కింగ్స్ ఎలెవన్ జట్టు.. కనివినీ ఎరుగని థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కేఎల్ రాహుల్ టీమ్‌ల్లో ప్లే ఆఫ్స్ ఆశలపై జీవం పోసింది.

ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని.. అందరూ ఉత్కంఠగా ఎదరు చూస్తున్న వేళ.. టీవీ స్క్రీన్‌పై ఓ అందమైన పిల్ల మెరిసింది. మత్తెక్కించే కళ్లతో.. గోళ్లు కొరుకుతూ దర్శనమిచ్చింది. పంజాబ్ జట్టును ఎంకరేజ్ చేస్తూ సందడి చేసింది. కెమెరామెన్ ఈ బ్యూటీపై ఫోకస్ పెట్టడంతో.. టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎవరబ్బా ఈమె అని.. ఆశ్చర్యపోయారు. ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ కష్టపడ్డారు. ఈమె ఎవరు? పేరేంటి? ఎవరికైనా తెలిస్తే చెప్పండని.. ట్వీట్ల మోత మోగించారు.

ఐతే మీరంతా వెతుకున్న మిస్టరీ గర్ల్ తానేనని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రపంచానికి తెలిపింది ఈ సూపర్ ఓవర్ గర్ల్. ఈమె పేరు రియానా లల్వానీ. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ వివరాల బట్టి.. రియానా దుబాయ్‌లోని జుమెరా కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఇటీవలే 23 వసంతంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తల్లిదండ్రులు నికిత, మను లల్వానితో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం మ్యాచ్‌లను వీక్షించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ్యాచ్‌‌కు ముందు రియా లల్వాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2500 మంది మాత్రమే అనుసరించారు. ఆ మ్యాచ్ తర్వాత అమ్మడి పేరు మార్మోగడంతో.. మూడు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏకంగా 67.7 వేలకు చేరింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన గురించి తాను ‘ఐపీఎల్ సూపర్ ఓవర్ గాళ్’గా రాసుకుంది రియానా.
రియానా ఇన్‌స్టగ్రామ్

ప్రస్తుతం రియానాను అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలా మంది యువత ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు. అంతేకాదు రియానా ఫ్లాన్స్ క్లబ్ పేరుతో పేజీలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించి.. ఒకే ఒక్క ఫొటోతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading