Rahul Tewatia: తొలుత ఇబ్బంది పడ్డాడు.. చివర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.. ఎవరీ తేవాటియా?

రాహుల్ తేవాటియా(Rahul Tewatia)

Rahul Tewatia: నాలుగో స్థానంలో తేవాటియాను బ్యాటింగ్‌కు పంపి రాజస్తాన్ జట్టు తప్పిదం చేసిందని అభిమానులు అనుకున్నారు. కానీ అతడే చివరల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.

  • Share this:
    ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని అందించింది. తొలుతు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణయించిన భారీ లక్ష్యాన్ని.. రాజస్తాన్ మూడు బంతుల్లో మిగిలి ఉండగానే చేధించింది. ఈ క్రమంలో రాజస్తాన్ ఆటగాడు రాహుల్ తేవాటియా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకు ముందు చాలా మందికి తెలియని ఈ పేరు.. ఇప్పుడు ప్రతి ఒక్కరినోళ్లలో నానుతుంది. స్మిత్ పెవిలియన్‌కు చేరిన తర్వాత బ్యాటింగ్‌ దిగిన తేవాటియా.. తొలుత బంతులు ఎదుర్కొలేక ఇబ్బంది పడ్డాడు. తొలుత తాను ఎదుర్కొన్న 19 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నాలుగో స్థానంలో తేవాటియాను బ్యాటింగ్‌కు పంపి రాజస్తాన్ జట్టు తప్పిదం చేసిందని అభిమానులు అనుకున్నారు. కానీ అతడే చివరల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు. కాట్రెల్ వేసిన 18 ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో చేలరేగాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

    దీంతో తేవాటియా గురించి తెలుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. తేవాటియా విషయానికి వస్తే.. హరియాణాకు చెందిన ఈ లెగ్ స్పిన్నర్.. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్ అడిన తేవాటియాకు ఐపీఎల్‌లో ఆడే చాన్స్ లభించింది. 2014లో రాజస్తాన్ రాయల్స్ ద్వారా ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చినా తేవాటియా.. ఆ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2017లో జరిగిన ఐపీఎల్ వేలంలో.. పంజాబ్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. అక్కడ కూడా పెద్దగా తన ఆటను ప్రదర్శించడానికి అవకాశం రాలేదు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. 2018 ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున 8 మ్యాచ్‌లు ఆడిన తేవాటియా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఆ తర్వాతి ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ తేవాటియాను తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. ఇక, ఆదివారం జరిగిన మ్యాచ్‌తో తేవాటియా పేరు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

    ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన పంజాబ్ జట్టును  మాయంక్ అగర్వాల్ 106 పరుగులు, రాహుల్ 69 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. దీంతో నిర్ణిత ఓవర్లలో పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన రాజస్తాన్ జట్టు మరో మూడు బంతులు మిగిలిన ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసిన రాజస్తాన్.. 4 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.
    Published by:Sumanth Kanukula
    First published: