Home /News /ipl /

WEST INDIES PLAYERS SANCTIONED FOR BREACHING ISOLATION RULES

కరోనా ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసిన ఆటగాళ్లు.. ఆహారాన్ని పంచుకున్న క్రికెటర్స్

west indies team

west indies team

కరోనా కారణంగా పకడ్బంది చర్యలతో క్రికెట్ నిర్వహణకు కోసం ఐసీసీ కృషి చేస్తుంటే.. ఆ ప్రయత్నానికి ఆటగాళ్ళు తుట్లు పోడుస్తున్నారు

    కరోనా కారణంగా పకడ్బంది చర్యలతో క్రికెట్ నిర్వహణకు కోసం ఐసీసీ కృషి చేస్తుంటే.. ఆ ప్రయత్నానికి ఆటగాళ్ళు తుట్లు పోడుస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్‌ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్‌ ఆటగాళ్లు కరోనా ప్రొటోకాల్ నియమాలను ఉల్లఘించారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు నిబంధనల్ని అతిక్రమించి బయటకువచ్చారు. ఆటగాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ 14 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండాలి. ఆ రూల్స్ ఏమి పాటించకుండా తాము బస చేసిన హోటల్లో ఇష్టానుసరంగా ప్రవర్తించారు. భౌతిక దూరం పాటించకుండా.. భోజన సమయంలో ఆహార పదార్థాలను షేరు చేసుకున్నారు. ఈ పరిణామాలన్ని న్యూజిలాండ్‌ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. హోటల్‌ సీసీటీవీల్లో రికార్డు అయిన ఆ సంఘటనలు చూసి ఆ దేశ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై దిద్దిబాటు చర్యలకు పూనుకుంది.

    వీండిస్ ఆటగాళ్ళు క్వారంటైన్‌‌లో ఉండి ఇప్పటివరకు 12 రోజుల ఉంది. అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఎవరికైనా పాజీటివ్ అని తేలితే మాత్రం మాత్రం ఐసోలేషన్‌ వ్యవధిని మరింతగా పొడిగిస్తారు. అలాగే వ్వహారశైలిపై న్యూజిలాండ్ ప్రభుత్వం విండీస్‌ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. నిబంధనల అతిక్రమణకు సంబంధించిన వీడియో ఫుటేజీలను వారికి పంపింది.

    కరోనా క్రీడారంగంపై ఎంతంటి ప్రభావం చూపిందో చూశాం. చాలా ఈవెంట్స్ ఈ మహామ్మారి కారణంగా వాయిదా పడుతూవచ్చాయి. కోవిడ్ ప్రభావం కాస్త తగ్గడంతో ఈవెంట్స్ ఇప్పుడిప్పుడే మెుదలవుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితిలలో ఐపీఎల్ లాంటి బిగ్ లీగ్స్ నిర్వహణ స్పూర్తి భారీ ఈవెంట్స్ జరపడానికి వివిధ క్రీడా సంఘాలు సిద్దమవుతున్నాయి. బయో బబుల్ కఠిన నిబంధనల మధ్య ఎమ్‌రైట్స్ ప్రభుత్వ సహాకారంతో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది బీసీసీఐ. సుమారు రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. పోటాపోటీ సమరాలు ఉత్కంఠ కలిగించిన టై మ్యాచ్‌లు ప్రేక్షకులను టీవీలకు అతుక్కు పోయేలా చేసింది.    త్వరలో ఆస్ట్రేలియా,భారత్ మధ్య సదీర్ఘ పర్యటన జరగనున్న విషయం తేలిసిందే!. నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆసీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కరోనా క్రీడారంగంపై ఎంతంటి ప్రభావం చూపిందో చూశాం. చాలా ఈవెంట్స్ ఈ మహామ్మారి కారణంగా వాయిదా పడుతూవచ్చాయి. కోవిడ్ ప్రభావం కాస్త తగ్గడంతో ఈవెంట్స్ ఇప్పుడిప్పుడే మెుదలవుతున్నాయి.

    కరోనా విపత్కర పరిస్థితిలలో ఐపీఎల్ లాంటి బిగ్ లీగ్స్ నిర్వహణ స్పూర్తి భారీ ఈవెంట్స్ జరపడానికి వివిధ క్రీడా సంఘాలు సిద్దమవుతున్నాయి. బయో బబుల్ కఠిన నిబంధనల మధ్య ఎమ్‌రైట్స్ ప్రభుత్వ సహాకారంతో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది బీసీసీఐ. సుమారు రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. పోటాపోటీ సమరాలు ఉత్కంఠ కలిగించిన టై మ్యాచ్‌లు ప్రేక్షకులను టీవీలకు అతుక్కు పోయేలా చేసింది.    త్వరలో ఆస్ట్రేలియా,భారత్ మధ్య సదీర్ఘ పర్యటన జరగనున్న విషయం తేలిసిందే!. నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆసీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: West Indies

    తదుపరి వార్తలు