IPL: వైజాగ్ టు ఆర్సీబీ: కీపర్ కె.ఎస్. భరత్ కు టీమిండియా ద్వారాలు తెరుచుకున్నట్టేనా?
వైజాగా కుర్రాడికి లక్ కలసి వచ్చింది. కీపర్ కం బ్యాట్స్ మెట్ కె.ఎస్ భరత్ ను ఆర్సీబీ జట్టు దక్కించుకుంది. అయితే బేస్ ప్రైజ్ కే కొనుక్కోవడం లక్ ఏంటి అనుకుంటున్నారా..? కానీ కోహ్లీ ఉన్న టీంలో నాలుగైదు మ్యాచ్ ల్లో రాణించినా.. భరత్ కు నేరుగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుంది.
వైజాగా కుర్రాడికి లక్ కలసి వచ్చింది. కీపర్ కం బ్యాట్స్ మెట్ కె.ఎస్ భరత్ ను ఆర్సీబీ జట్టు దక్కించుకుంది. అయితే బేస్ ప్రైజ్ కే కొనుక్కోవడం లక్ ఏంటి అనుకుంటున్నారా..? కానీ కోహ్లీ ఉన్న టీంలో నాలుగైదు మ్యాచ్ ల్లో రాణించినా.. భరత్ కు నేరుగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుంది.
టీమిండియాకు ఎం.ఎస్ ధోనీ రిటైర్మెంట్ తరువాత సరైన ప్రత్యామ్నాయం ఇప్పటికీ దొరకలేదు. పంత్ టీంలో కొనసాగుతున్నా అప్పుడప్పుడూ మెరుపులు తప్ప నిలకడ లేదు. కీపింగ్ లో అప్పుడప్పుడు వైఫల్యాలు అతడి ఫ్యూచర్ పై అనుమానాలు పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాడు ఆంధ్రా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్. తాజాగా ఐ.పి.ఎల్ వేలంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం అతడ్ని దక్కించుకుంది.
ఈ ఐపీఎల్ వేలం ముందు వరకు విశాఖకు చెందిన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు స్టాండ్ బైగా జట్టులో కొనసాగిన శ్రీకర్ భరత్.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు కోహ్లీ సారథ్యంలోని రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ జట్టుకు ఎంపిక అవ్వడంతో అతడి ఫేట్ మారే అవకాశం ఉంది.
ఇప్పటివరకూ భరత్ 78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్ ల్లో 4283 పరుగులు చేయగా, లిస్ట్-ఎ క్రికెట్లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 48 మ్యాచ్‌లకు గాను 730 పరుగులు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 సెంచరీలు 23 హాఫ్ సెంచరీలు ఉండగా, లిస్ట్-ఎ క్రికెట్లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు భరత్. దీనికి తోడు రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందాడు. ఇక భారత జట్టుకు వేణుగోపాల్ రావు తరువాత ఎంపికైనా ఏకైక వైజాగ్ క్రికెటర్ కూడా భరత్ మాత్రమే.
ఈక్రమంలో కేఎస్ భరత్‌పై విశ్లేషకుల అంచనా ఈ సారి ఎక్కువగానే ఉండేవి. కానీ అనూహ్యంగా కేఎస్ భరత్ కనీస ధరకే అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. కేఎస్ భరత్‌ను 20 లక్షల రూపాయల కనీస ధరకే ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ బిడ్‌కు వెళ్లగా ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దాంతో 20 లక్షలకే ఆర్సీబీ సొంతమయ్యాడు భరత్.
బేస్ ప్రైజ్ కే బెంగళూర్ అతడ్ని సొంతం చేసుకున్నా.. జట్టులో రెగ్యులర్ కీపర్ లేకపోవడంతో భరత్ కు కచ్చితంగా మ్యాచ్ లు ఆడే అవకాశం వస్తుంది. అందులోనూ ఆర్ సీబీ జట్టులో ఉండి సక్సెస్ అయితే నేరుగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ సపోర్ట్ ఉంటుంది. మహ్మద్ సిరాజ్ కూడా ఆర్ సీబీకి ఆడడంతోనే టీమిండియా తరపున ఆడే బౌలింగ్ చేసే అవకాశం దొరికింది అన్నది బహిరంగ రహస్యం. దీంతో ఈ ఏడాది ఆర్సీబీ టీంకు ఆడుతుండడం భరత్ లక్కీ ఛాన్స్ అనే చెప్పొచు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.