news18-telugu
Updated: November 6, 2020, 10:17 PM IST
సోషల్ మీడియాలో ట్రోలింగ్ (Image:Twitter)
#ThankYouVirat #ThankyouKohli ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. 'రిటైర్మెంట్ ప్రకటించినందుకు, ఇన్నేళ్లు టీమిండియాకు చేసి సేవలకు గాను కొహ్లీకి ధన్యవాదాలు'.. అంటూ నెటిజన్లు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. ఇదేంటి.. విరాట్ కొహ్లీ ఎప్పడు రిటైర్మెంట్ ప్రకటించారని షాక్ అవుతున్నారా? అదేం లేదు. కొహ్లీ రిటైర్మెంట్ ప్రకటించలేదు. హైదరాబాద్ మ్యాచ్‌లో కొహ్లీ విఫలమైనందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 'నీ సేవలు చాలు ఇక వెళ్లిపో..' అంటూ ఆటాడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ చెతులెత్తేశాడు. సీజన్లో తొలిసారి బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని.. రెండో స్థానం నుంచి ఓపెనర్‌గా వచ్చిన కొహ్లీ.. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండో ఓవర్లలో ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హైదరాబాద్ బౌలర్ హోల్డర్ అతడిని బోల్తా కొట్టించాడు. కొత్త కీపర్ గోస్వామి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కొహ్లీ దొరికిపోయాడు. ఐతే కీలకమైన మ్యాచ్‌లో కొహ్లీ ఔట్ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అదే సమయంలో నెటిజన్లు రెచ్చిపోయారు. కొహ్లీని ఆటాడుకుంటున్నారు.
సూర్యకుమార్‌ను, కొహ్లీ ఇన్సింగ్స్‌ను పోల్చుతూ కొందరు ట్వీట్స్ పెడుతున్నారు. కొహ్లీ కన్నా సూర్యకుమార్ చాలా బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఐతే మరికొందరు మాత్రం విరాట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా? అని తప్పుబట్టుతున్నారు. టీమిండియా తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు బద్దలుకొట్టాడని మెచ్చుకుంటున్నాడు. వరల్డ్ నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్‌ను ఇలా అగౌరవ పరచడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో.. ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి 15 మ్యాచ్‌లు ఆడాడు కొహ్లీ. 42.36 యావరేజీతో 466 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 90 నాటౌట్. ఐతే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చి.. విఫలమయ్యాడు కొహ్లీ. ఈ క్రమంలోనే అతడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 6, 2020, 10:09 PM IST