IPL 2020: కొలనులో ఆర్సీబీ ఆటగాళ్ళ గొడవ..గొడవ.. హ్యాపీగా అనుష్క

IPL 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మంచి ఊపు మీద కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ జట్టు మూడు మ్యాచ్‌లు అడగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

news18-telugu
Updated: September 30, 2020, 8:29 PM IST
IPL 2020: కొలనులో ఆర్సీబీ ఆటగాళ్ళ గొడవ..గొడవ.. హ్యాపీగా అనుష్క
rcb
  • Share this:


IPL 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మంచి ఊపు మీద కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ జట్టు మూడు మ్యాచ్‌లు అడగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సోమవారం ముంబాయి ఇండియన్స్‌తో  జరిగిన  ఉత్కంఠ పోరులో ఆర్సీబీ జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. టై అయిన ఈ మ్యాచ్‌ చివరకి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఈ ఓవర్‌లో తొలిత బ్యాటింగ్ చేసిన ముంబై 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని సునయసంగా ఛేధించి మరో గెలుపును తన ఖాతలో వేసుకుంది.




గత ఐపీఎల్‌లో వరుస అపజయాలతో ఆప్రతిష్టను మూటగట్టుకున్న ఆర్సీబీ ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో పర్వాలేదనిపిస్తోంది. థ్రిల్లింగ్ విక్టర్సీతో నూతనోత్తేజంతో ఉన్న జట్టు యుఏఈలో తెగ ఎంజాయ్ చేస్తోంది. జట్టు విజయాల సాధిస్తుండడంతో ఆటగాళ్ళు, జట్టు సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. మంగళవారం ఆడుతూ.. పాడుతూ ఆనందంగా గడిపారు. ఈత కొలనులో వాలీబాల్‌ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఆటగాళ్లు సరదాగా గొడవ పడుతూ విరామ సమయాన్ని ఆస్వాదించారు.Hindustantimes

విరాట్ కోహ్లీ, పేసర్ నవదీప్ సైనీ, ఆల్‌రౌండర్‌ శివమ్ దూబె, వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్ హింది పాత పాటలను అనుకరిస్తూ ఈత కొలనులో గడిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క అడుగు ముందుకు వేసి స్టెప్పులను వెస్తూ కనిపించారు. అలాగే ఆర్సీబీ విజయాలపై అనుష్క శ‌ర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. 'ఓ గ‌ర్భిణి.. మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంతక‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంది' అని పేర్కొన్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 30, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading