ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: తిన్నావారా..? అనుష్కశర్మను అడిగిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్

విరుష్కలు ఏం చేసినా సంచలనమే. స్టాండ్ లో నిలబడి విరాట్ టీం ను ప్రోత్సహించడంలో అనుష్క శర్మ ఎప్పుడూ ముందుంటుంది. అయితే తాజాగా వీరిద్దరి వీడియో క్లిప్ ఒకటి వైరలవుతున్నది.

news18
Updated: October 29, 2020, 12:47 PM IST
IPL 2020: తిన్నావారా..? అనుష్కశర్మను అడిగిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
Image credit : twitter
  • News18
  • Last Updated: October 29, 2020, 12:47 PM IST
  • Share this:
‘తిన్నావారా..?’ టిక్ టాక్ ఉన్న రోజుల్లో.. ఈ పదమెంతో ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ ఒక్క పదం మీదే మిక్స్ లు, రీమిక్స్ లు వచ్చి కుర్రకారును ఒక ఊపు ఊపింది. తాజాగా భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన భార్యను చూస్తూ చేసిన సైగ.. దానిని మరోసారి గుర్తుకు తెచ్చింది. గర్భవతి అయిన అనుష్క శర్మ ను చూస్తూ.. విరాట్ కోహ్లి చేసిన సైగలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. క్యూట్ జంట అంటూ నెటిజన్లు వారిరువురిపై ఉన్న అభిమానాన్ని చూపెడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న.. తీరిక లేని క్రికెట్ ఆడినా కుటుంబానికి విలువిచ్చే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకరు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాలీవుడ్ భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. త్వరలోనే ఈ జంట ముగ్గురు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు కోహ్లి.

ఐపీఎల్ కోసం కోహ్లి దుబాయ్ వెళ్లగా.. ఈ మధ్యే అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ విరాట్ తో పాటు ఆయన టీంను ప్రోత్సహిస్తున్నారు. అయితే నిన్న ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో ఉండగా.. స్టాండ్స్ లో అనుష్క శర్మ బయటకువచ్చింది. ఆమెను చూసిన కోహ్లి.. భోజనం చేశావా..? అని అడిగాడు. సైగ రూపంలో కోహ్లి అనుష్క శర్మను అడగడంతో.. ఆమె కూడా స్పందించింది. నూవు కూడా వచ్చినాక కలిసి తిన్నామన్నట్టుగా ఆమె స్పందించింది. ఈ వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
వీడియో పోస్ట్ చేయంగానే ట్విట్టర్ లో ఈ వీడియోకు వేల సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి. నెటిజన్లు వీరిద్దరినీ క్యూట్ కపుల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు అపజయం పాలైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ వీరోచిత ఇన్నింగ్స్ తో ముంబై ప్లేఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
Published by: Srinivas Munigala
First published: October 29, 2020, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading