హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

Vijay shankar: విజయ్ శంకర్ కేక.. ఇదేంటి.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు..

Vijay shankar: విజయ్ శంకర్ కేక.. ఇదేంటి.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు..

విజయ్ శంకర్ (Image:IPL)

విజయ్ శంకర్ (Image:IPL)

Vijay Shankar: బ్యాటింగ్‌లో రాణించనప్పటికీ.. బాగా బౌలింగ్ చేశాడని కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్ శంకర్‌ను విమర్శించే వారికి కౌంటర్ ఇస్తున్నారు. అతడు నిజంగానే త్రీడీ ప్లేయర్ అని మెచ్చుకుంటున్నారు.

విజయ్ శంకర్.. టోర్నీ ఏదైనా ఈ మధ్య మనోడి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అంబటి రాయుడిని కాదని వరల్డ్ కప్ టీమ్‌‌కు ఎంపిక చేసినప్పటి నుంచి వార్తల్లో ఉంటున్నాడు. ఐతే ఈ ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్ తరపున ఆడుతున్న విజయ శంకర్.. పెద్దగా రాణించడం లేదు. 3డీ ప్లేయర్‌గా పిలుచుకునే విజయ్ శంకర్.. అందుకు తగ్గట్లుగా ఆడడం లేదు. బౌలింగ్, బ్యాటింగ్.. రెండింటిలోనూ విఫలమవుతున్నాడు. జట్టులో అతడి ప్రదర్శన చూసి హైదరాబాద్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఇతడి జట్టులోకి ఎందుకు తీసుకున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు విజయ్ శంకర్. మొత్తంగా 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధిక స్కోరు 12. ఒకే ఒక్క సిక్స్ కొట్టాడు. ఫోర్లు అస్సలు లేవు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 8.2 ఓవర్లు వేసి, 56 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లను పడగొట్టాడు. ఐతే బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడని కొందరు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అబుదాబిలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా స్పెల్ వేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన విజయ్ శంకర్.. కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు.

బ్యాటింగ్‌లో రాణించనప్పటికీ.. బాగా బౌలింగ్ చేశాడని కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్ శంకర్‌ను విమర్శించే వారికి కౌంటర్ ఇస్తున్నారు. అతడు నిజంగానే త్రీడీ ప్లేయర్ అని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.


మరికొందరు మాత్రం విజయ్ శంకర్ వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శిస్తున్నారు. జట్టు నుంచి అతడిని తప్పించాలని కోరుతున్నారు.
కాగా, అబుదాబిలో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చారు. సూపర్‌లో అద్భుతంగా రాణించి కోల్‌కతా జట్టు విజయం సాధించింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ సేన.. కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. మరో ఆరింటిలో పరాజయం పాలయింది.

First published:

Tags: IPL, IPL 2020, Sun risers hyderabad

ఉత్తమ కథలు