Home /News /ipl /

TWITTERATI REACTS AS EOIN MORGAN VISITS SHEIKH ZAYED GRAND MOSQUE WITH HIS WIFE SK

IPL 2020: అరబ్ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ క్రికెటర్‌ని గుర్తు పట్టారా? ఫొటో వైరల్

ఇయాన్ మార్గాన్ దంపతులు

ఇయాన్ మార్గాన్ దంపతులు

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన ఇయాన్ మోర్గాన్.. 25.44 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.

    IPL 2020: ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లాయి. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ముంబై టీమ్ ఇప్పటికే ఫైనల్‌లో కూడా అడుగుపెట్టింది. ఐతే హైదరాబాద్ దెబ్బకు కోల్‌కతా ప్లేఆఫ్స్‌ వెళ్లలేకపోయింది. లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై హైదరాబాద్ ఓడితే.. కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది. కానీ ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ముంబై ఓడించి.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ని ఇంటికి పంపించింది.

    కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవడంతో జట్టు ఆటగాళ్లంతా యూఏఈ నుంచి ఇండియాకు చేరుకున్నారు. ఐతే అంతకంటే ముందు బుధవారం కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అబుదాబి వీధుల్లో భార్యతో కలిసి చక్కర్లు కొట్టాడు. ప్రఖ్యాత షేక్ జాయెద్ మసీదను సందర్శించారు. మోర్గాన్ దంపతులిద్దరు అరబ్ సంప్రదాయ దుస్తులను ధరించి మసీదులోకి వెళ్లారు. ఆ ఫొటోలను గురువారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు మోర్గాన్.

    అరబ్బుల గెటప్‌లో ఉన్న మోర్గాన్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దానిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. లుక్ అదిరిందని కొందరు కామెంట్ చేయగా.. అస్సలు గుర్తు పట్టలేకపోయామని.. మరికొందరు ట్వీట్ చేశారు.



    ఐపీఎల్ 2020 టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన ఇయాన్ మోర్గాన్.. 25.44 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 68 నాటౌట్. కేకేఆర్ కెప్టెన్సీ నుంచి దినేష్ కార్తీక్ తప్పుకోవడంతో.. అనంతరం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ఇయాన్ మోర్గాన్. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డాడు. బెంగళూరు, హైదరాబాద్ జట్లతో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్‌లో వెనకబడడంతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.

    ORANGE CAP:

    PURPLE CAP:
    టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. ఏడు మ్యాచ్‌లు గెలిచి... మరో ఏడింట ఓడిపోయింది. 14 పాయింట్లతో ఐదో స్థానానికే పరిమితయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Kolkata Knight Riders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు