Home /News /ipl /

TOSS UP BETWEEN MAYANK AND SHUBMAN AS DHAWAN S OPENING PARTNE SA

రోహిత్ స్థానంలో కేకేఆర్ స్టార్ ఆటగాడు.. ఓపెనర్‌గా బరిలోకి

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ

ఆసీస్ పర్యటన మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో ఇప్పుడు కొత్త సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఆసీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓపెనర్‌ రోహిత్ శర్మ దూరమవ్వడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై బీసీసీఐ కసరత్తులు మెుదలుపెట్టింది.

ఇంకా చదవండి ...


    ఆసీస్ పర్యటన మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో ఇప్పుడు కొత్త సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఆసీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓపెనర్‌ రోహిత్ శర్మ దూరమవ్వడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై బీసీసీఐ కసరత్తులు మెుదలుపెట్టింది. శిఖర్ ధావన్‌తో ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌‌కు రాణించే సత్తా ఉన్నప్పటికి అయితే ఆ స్థానంలో అతన్ని బరిలోకి దింపుతారో.. లేదో అనుమానంగా ఉంది. అతన్ని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దింపాలనే బీసీసీఐ చూస్తో్ంది. అయితే ఓపెనింగ్ స్ధానంలో మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

    ఓపెనర్‌గా గిల్‌ను పపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు బలం చేకూరేలా తాజాగా ట్విటర్‌లో కనిపించిన ఓ చిత్రంలో టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి గిల్‌కు సూచనలు ఇస్తూ కనిపించారు. ధావన్‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. యంగ్ బాట్స్‌మెన్ శుభ్‌మన్‌ గిల్ ఐపీఎల్ 2020లో కేకేఆర్ తరుపున ఓపెనర్‌గా బరిలోకి దిగి పర్వాలేదనిపించాడు. కోల్‌కతా తరఫున 440 పరుగులు చేశాడు. అలాగే పంజాబ్‌ బాట్స్‌మెన్ మయాంక్‌ అగర్వాల్ కూడా 418 పరుగులతో రాణించాడు. కావున వీరిద్దరిలో ఒక్కరు ఓపెనింగ్ బరిలొకి దిగే అవకాశం ఉంది. . త్వరలో ఆస్ట్రేలియా,భారత్ మధ్య సదీర్ఘ పర్యటన జరగనుంది. నవంబర్‌ 27 నుంచి ఆ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నిలో భాగంగా భారత్,ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు,నాలుగు టెస్టులు ఆడనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    తదుపరి వార్తలు