news18-telugu
Updated: November 9, 2020, 10:31 AM IST
అనుష్క శర్మ విరాట్ కోహ్లీ (anushka virat kohli)
టీమిండియాను ఒంటిచెత్తో నడిపించిన ధీరుడు... స్టార్ బాట్స్మెన్.. సూపర్ ఫీల్డర్.. ఓ క్రికెటర్‌కు కావాల్సిన అన్ని లక్షాణాలు కలగలిపి ఉన్న వీరుడు. కానీ అలాంటి సారథి.. ఆర్సీబీ జట్టు చిరకాల వాంఛను మాత్రం తీర్చలేకపోతున్నాడు. అభిమానుల ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రాయల్స్ టైటిల్ సాధించాలనే కలను నెరవేర్చలేకపోతున్నాడు. కీలక సమయాలలో చేతులేత్తుస్తున్నాడు. టీమిండియాలో చూపించిన తెగువ ఇక్కడ చూపించడం లేదు. ఆర్సీబీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియక అభిమానులు తికమకపడుతున్నారు. ప్రతి సారి వారికి గుండెకోతే మిగిలుతుంది.
విచిత్రమైన నిర్ణయాలతో బెంగళూరు జట్టును నిండా ముంచెస్తున్నాడు. ‘ఈ సాలా కప్ నమదే’ అని కోహ్లి ఏ ముహుర్తానా అన్నాడో.. తెలియదు కానీ ఆర్సీబీ అభిమానులు ఐపీఎల్ ఈవెంట్ మెుదలవగానే ఆ వీడియోని సోషల్ మీడియాలో షేరు చేస్తుంటారు. ఇక బెంగళూర్ టోర్నీ నుంచి నిష్ర్కమించగానే ఆ వీడియోపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటారు. ఇది ఒక్క అలవాటుగా మారిపోయింది. ఈ సారి ఫ్లేఆఫ్‌కు చేరినా ఆర్సీబీని చూసి టైటిల్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. వారి బాధ ఎంతటిదో ఊహించుకోవచ్చు. చివరకు సారథి మార్పలనే
నిర్ణయానికి వచ్చారు ఫ్యాన్స్. అయితే యాజమాన్యం ఆ సాహసం చేయలేదు. ఇక వచ్చే ఏదాది కోహ్లి సతిమణి బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ చిన్నారితోనైనా అతనికి అదృష్టం కలిసి రావాలని అభిమానలు ఆశిస్తున్నారు.
ఆర్సీబీ విఫలమైన ప్రతిసారి విరాట్ కోహ్లీయే టార్గెట్ అవుతున్నాడు. అతని నాయకత్వం పైనే విమర్శలు వస్తున్నాయి. ఉన్న పళంగా ఆటగాళ్ళును మార్చేయడం.. ప్రతి మ్యాచ్‌లో జట్టు స్వ్కాడ్‌లో మార్పులు చేయడం ఆర్సీబీ సారథిపై విశ్లేషకులు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. అతను వరుసగా రెండు మ్యాచుల్లో ఒకే జట్టుతో బరిలోకి దిగిన సందర్భాలు చాలా అరుదనే చేప్పాలి. విన్నింగ్ టీంతో ముందుకు వెళ్ళడంలో కూడా సంకోచిస్తాడు. ఇలా కోహ్లిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు కూడా బహాటంగానే పెదవి విరుస్తున్నారు. "బెంగళూరు కాబట్టి కోహ్లీని ఇంకా సారథిగాఉంచుతోంది. ఇంకో జట్టైతే ఎప్పుడో తీసేసేది’ అంటూ గంభీర్ విమర్శించాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమనిపిస్తున్నాయి. సారథులుగా ధోనీ, రోహిత్ ఏం సాధించారో అది కోహ్లి సాధించలేకపోతున్నాడు. ఇక వచ్చే సీజన్లో బెంగళూర్ యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆర్సీబీ జట్టు పరిస్థితి మారేలా కనిపించడం లేదు.
Published by:
Rekulapally Saichand
First published:
November 9, 2020, 10:30 AM IST