• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • THEY ARE TAKING ADVANTAGE OF MY FREE ADVICE SAYS VIRENDER SEHWAG AFTER DC PROMOTE MARCUS STOINIS AS OPENER SK

IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వెనక సెహ్వాగ్.. ఆ ఒక్క సలహా వల్లే..

IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వెనక సెహ్వాగ్.. ఆ ఒక్క సలహా వల్లే..

వీరేంద్ర సెహ్వాగ్

తాను ఇచ్చిన ఓ ఉచిత సలహా ఆ జట్టుకు ఎంతో ఉపయోగ పడిందని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. శ్రేయర్ టీమ్ విజయానికి అదే కారణమని తెలిపారు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇదే ఆఖరి రోజు. సాయంత్రం దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐతే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన తర్వాత ఢిల్లీ ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు గురించి తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. తాను ఇచ్చిన ఓ ఉచిత సలహా ఆ జట్టుకు ఎంతో ఉపయోగ పడిందని వెల్లడించారు. శ్రేయర్ టీమ్ విజయానికి అదే కారణమని తెలిపారు.

    'క్వాలిఫయర్‌-2లో టాస్‌ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌క దిగడం వంద శాతం మంచి నిర్ణయం.  అంతేకాదు ఢిల్లీ టీమ్ తీసుకున్న ఒక నిర్ణయంతో ఆశ్చర్యపోయా. స్టోయినిస్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తే బాగుటుందని నేను చెప్పా.  అలాగే చేశారు. నేను ఇచ్చిన ఉచిత సలహా ఢిల్లీకి ఎంతో ఉపయోగపడింది.  స్టోయినిస్‌ ఆరంభంలోనే ఇచ్చిన క్యాచ్‌ను సన్‌రైజర్స్‌  ఆల్‌రౌండర్ హోల్డర్‌ వదిలేయడం  హైదరాబాద్‌కు టీమ్‌కు మైనస్‌గా మారింది.  ఆ క్యాచ్ వదిలిపెట్టినప్పుడు స్టోయినిస్‌ మూడు పరుగులే చేశాడు. హోల్డర్ క్యాచ్ పట్టి ఉంటే ఢిల్లీపై ఒత్తిడి వచ్చేది. కానీ  ఆ తర్వాత స్టోయినిస్‌ విలువైన పరుగుల్ని సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.' అని సెహ్వాగ్ పేర్కొన్నారు.


    క్వాలిఫైయర్2 మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్‌పై 17 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్‌మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఐతే షాబాజ్ నదీమ్, హోల్డర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిస్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లను వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది.

    అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మనీష్ పాండే 21 పరుగులు సాధించాడు. వార్నర్ 2, ప్రియం గార్గ్ 17, జేసన్ హోల్డర్ 11, రషీద్ ఖాన్ 11, గోస్వామి 0కే పరిమితమయ్యారు. నదీమ్ 2, సందీప్ శర్మ2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్లు 19వ ఓవర్‌లోనే పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి హైదరాబాద్ నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు వెళ్లింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు