Home /News /ipl /

SURYAKUMAR YADAV IS A VERY GOOD PLAYER HIS TIME WILL COME SOON BCCI PRESIDENT SOURAV GANGULY SK

IPL 2020: సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు

సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ గంగూలీ

సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ గంగూలీ

IPL 2020: ఐపీఎల్‌తో గత మూడేళ్లుగా స్థిరంగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. 2018లో 14 మ్యాచ్‌ల్లో 133 స్ట్రైక్ రేట్‌తో 512 పరుగులు చేశాడు.

    సూర్యకుమార్ యాదవ్.. కొత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడుకున్నా.. దేశవాళీ టోర్నీలో మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. టాప్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముంబై జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ఈ సీజన్‌లోనూ బాగా రాణించాడు సూర్య. కానీ ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టుకు ఎంపిక కాలేదు. జాతీయ జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. ఇప్పటికీ అతడి కల సాకారం కాలేదు. సూర్యకు ఎంతో ట్యాలెంట్ ఉందని.. ఇంకా ఏం నిరూపించుకోవాలని.. చాలా మంది సీనియర్లు బీసీసీఐని విమర్శిస్తున్నారు. జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇటీవల జరిగిన బెంగళూరు, ముంబై మ్యాచ్‌లో కొహ్లీ, సూర్యకుమార్ తీరు కూడా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్‌ను స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టాడు కొహ్లీ. ఐనా అవేమీ పట్టించుకోకుండా సూర్యకుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబై టీమ్‌ను గెలిపించాడు సూర్య. ఐతే కొహ్లీ వల్లే సూర్యకు టీమిండియాలో చోటు లభించడం లేదని.. చాలా మంది క్రికెటర్ అభిమానులు మండిపడ్డారు. భారత జట్టులో ఆర్సీబీ ఆటగాళ్లకే అవకాశమిస్తున్నాడని.. సూర్య ఆర్సీబీకి ఆడి ఉంటే.. ఎప్పుడే బ్లూ జెర్సీలో కనిపించే వాడని అభిప్రాయపడుతున్నారు.

    ఈ క్రమంలో భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'అతడు చాలా మంది ఆటగాడు. త్వరలోనే అతడి టైం వస్తుంది.' అని పేర్కొన్నాడు. కొన్ని రోజులు క్రితం టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ''యువ ఆటగాళ్లు ఓపికతో ఉండాలి. సూర్యకుమార్‌తో పాటు మరో ముగ్గురు, నలుగురు మంచి ఆటగాళ్లు ఉన్నారు. జట్టు ప్రతిభావంతులపై ఆటగాళ్లతో నిండిపోయినప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.'' అని పేర్కొన్నారు.
    POINTS TABLE:


    ORANGE CAP:


    PURPLE CAP:

    ఐపీఎల్‌తో గత మూడేళ్లుగా స్థిరంగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. 2018లో 14 మ్యాచ్‌ల్లో 133 స్ట్రైక్ రేట్‌తో 512 పరుగులు చేశాడు. 2019లో 16 మ్యాచ్‌ల్లో 130 స్ట్రైక్‌తో 424 రన్స్ చేశాడు. ఇక ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 41 యావరేజీతో 410 రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు