IPL 2020: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లు దూరం!

ఐపీఎల్ జరుగుతుందని ఫ్యాన్స్‌ ఓవైపు సంతోషంగా ఉన్న మరోవైపు ఆటలోని అసలైన మజాను ఎంజాయి చేయలేమనే బాధ ఇప్పుడు వారిలో మెుదలైంది. ఎందుకంటే..

Rekulapally Saichand
Updated: July 31, 2020, 3:27 PM IST
IPL 2020: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..  ఐపీఎల్ మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లు దూరం!
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
ఐపీఎల్ జరుగుతుందని ఫ్యాన్స్‌ ఓవైపు సంతోషంగా ఉన్న మరోవైపు ఆటలోని అసలైన మజాను ఎంజాయి చేయలేమనే బాధ ఇప్పుడు వారిలో మెుదలైంది. అదే కొంత మంది విదేశీ ప్లేయర్స్ టోర్నీకి గైహాజరు అయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు వారం రోజులు లేటుగా వస్తారని సమాచారం. అలాగే శ్రీలంక,దక్షిణాప్రికా ఆటగాళ్ళు 15 రోజులు పాటు అలస్యంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) కారణంగా శ్రీలంక ఆటగాళైనా లసిత్ మలింగ(ముంబై ఇండియన్స్), ఇస్రు ఉడానా(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) తమ ఫ్రాంచైజీలతో ఆలస్యంగా కలవనున్నారు. ఎల్‌పీఎల్ సెప్టెంబర్ 20న ముగియనుంది. లంక బోర్డు నింబంధనల ప్రకారం  లీగ్ మధ్యలో వేరే టోర్నీలు ఆడేందుకు అనుమతి ఉండదు ఈ కారణంగా వారు ఐపీఎల్ పగం మ్యాచ్‌ల వరకు దూరమయే అవకాశం కనిపిస్తోంది. ముంబైకు మలింగ కీలక ఆటగాడు. ఇది ఆ జట్టు గట్టి దెబ్బే అని చేప్పవచ్చు.

అలాగే సెప్టెంబర్ 16 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ ఉండడంతో వారు మెుదటి వారంలో మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇది ఫ్యాన్స్
కొంత వరకు నిరాశపరిచే విషయం. ఎందుకంటే ఐపీఎల్‌లో మెజార్టీ శాతం ఆటగాళ్ళు ఈ రెండు దేశాల నుంచే ఉన్నారు. ఆస్ట్రేలియా(17), ఇంగ్లండ్(11) మొత్తం 28 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లోని వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 31, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading