ఐపీఎల్ 2020

  • associate partner

Ipl 2020 SRH vs RCB: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. మ్యాచ్‌ని మలుపుతిప్పిన చాహాల్


Updated: September 21, 2020, 11:53 PM IST
Ipl 2020 SRH vs RCB: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. మ్యాచ్‌ని మలుపుతిప్పిన చాహాల్
విరాట్ కోహ్లీ
  • Share this:
దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగిన మ్యాచ్‌ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరగా బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో గెలుపోందింది. సన్‌రైజర్స్ జట్టులో జానీ బెయిర్‌‌స్టో 61 పరుగులు చేయగా మనీష్ పాండే 34 పరుగులు చేశారు. వార్నర్ నాటకీయ పరిణామంలో ఔటవ్వడం.. ఆ తర్వాత బెయిర్‌‌స్టో,మనీష్ పాండే అదుకునే ప్రయత్నం చేసిన.. వారు  కూడా ఔటవ్వడంతో సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్ వెంటనే..వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఓటమిపాలైంది.  చివరకు 153 పరుగులకు  సన్‌రైజర్స్  టీం ఆలౌట్ అయింది.

మెుదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పాడికల్ 42 బంతుల్లో 7 ఫోర్లుతో 56 పరుగులు చేయగా మరో స్టార్స్ బాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ 30 బంతుల్లో 4 ఫోర్లుతో 2 'సిక్స్‌లతో 51 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.



ఎస్ఆర్‌హెచ్ వైపు  ఉన్న మ్చాచ్‌ని చాహల్ తన స్పీన్  మాయజాలంతో ఆర్సీబీ వైపు తిప్పాడు. నాలుగు ఓవర్లలలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దాటిగా ఆడుతున్న  బెయిర్‌‌స్టోను ఔట్ చేసి మ్యాచ్‌ని టర్న్ చేశాడు.
Published by: Rekulapally Saichand
First published: September 21, 2020, 11:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading