SRH VS KXIP IPL 2020 LIVE UPDATES KINGS ELEVEN PUNJAB VS SUN RISERS HYDERABAD KINGS SCORE IS 126 SK
SRH vs KXIP, IPL 2020 live score: కింగ్స్‌ను కట్టడి చేసిన రైజర్స్.. హైదరాబాద్ గెలుస్తుందా?
రషీద్ ఖాన్ (Image:IPL)
SRH vs KXIP, IPL 2020 live score: జట్టు స్కోర్ 66 వద్ద క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ వరుసగా ఔట్ అవడంతో.. పంజాబ్ పతన ప్రారంభమయింది. అనంతరం మెల్లమెల్లగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా రన్ రేట్ తగ్గిపోయి.. 126 పరుగులకు పరిమితమయింది పంజాబ్ జట్టు.
SRH vs KXIP, IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 43వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (kings xi punjab) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి.. పంజాబ్‌ను కట్టడి చేశారు. నికోలస్ పూరన్ (32), కెప్టెన్ కేఎల్ రాహుల్ (27), క్రిస్ గేల్ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగతా వారంతా విఫలమయ్యారు. మన్దీప్ సింగ్ 17, గ్లెన్ మాక్స్వెల్ 12, దీపక్ హుడా 0, క్రిస్ జోర్డాన్ 7 రన్స్ మాత్రమే చేశారు.
ఐదో ఓవర్లో మన్దీప్ సింగ్ ఔటైన తర్వాత క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఇన్సింగ్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఐతే జట్టు స్కోర్ 66 వద్ద క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ వరుసగా ఔట్ అవడంతో.. పంజాబ్ పతన ప్రారంభమయింది. అనంతరం మెల్లమెల్లగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా రన్ రేట్ తగ్గిపోయి.. 126 పరుగులకు పరిమితమయింది పంజాబ్ జట్టు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఇప్పటి వరకు 15 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ ఏకంగా 11 సార్లు గెలిచి పంజాబ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకుముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 8న దుబాయ్ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఏకంగా 69 పరుగులు తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది పంజాబ్. మరోసారి కింగ్స్‌ను ఓడించి సత్తా చాటాలని సన్‌రైజర్స్ కూడా పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2020 టోర్నీలో SRH, KXIP సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు.. చెరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మరో 6 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాయి. ఇద్దరికీ 8 పాయింట్లు వచ్చాయి. నెట్ రన్‌రేట్ కారణంగా కింగ్స్ కంటే సన్‌రైజర్స్ మెరుగైన స్థానంలో ఉంది. హైదరాబాద్ ఐదో స్థానంలో ఉండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.