Home /News /ipl /

SRH vs KKR: ఆ అంపైర్ ఆడా? మగా? కన్‌ఫ్యూజన్‌లో సోషల్ మీడియా

SRH vs KKR: ఆ అంపైర్ ఆడా? మగా? కన్‌ఫ్యూజన్‌లో సోషల్ మీడియా

పశ్చిమ్ పాఠక్ (Image:Twitter)

పశ్చిమ్ పాఠక్ (Image:Twitter)

IPL 2020: పొడవాటి నల్లని జట్టు.. దానిని కవర్ చేస్తూ క్యాప్ ధరించడంతో.. అసలు ఆ అంపైర్ ఎవరని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆడా? మగా? తెలియక తెగ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

    IPL 2020: అబుదాబిలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఎవరు? ఆడా? మగా? ఇప్పుడు దీనిపైనే ఐపీఎల్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఐపీఎల్‌లో తొలిసారిగా ఓ మహిళ అంపైరింగ్ చేస్తోందా? చాలా మంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పొడవాటి నల్లని జట్టు.. దానిని కవర్ చేస్తూ క్యాప్ ధరించడంతో.. అసలు ఆ అంపైర్ ఎవరని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆడా? మగా? తెలియక తెగ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దయ చేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని కోరుతున్నారు. ఈ అంపైర్ లుక్‌ను ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.




    కొందరు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆ అంపైర్‌‌ను గుర్తుపట్టారు. మహిళ అంపైర్ కాదని.. పురుషుడేనని క్లారిటీ ఇచ్చారు. ఆయన పేరు పశ్చిమ్ పాఠక్ అని.. లుక్ అదుర్స్ అని ట్వీట్స్ చేస్తున్నారు.






    పశ్చిమ్ పాఠక్ చాలా కాలంగా అంపైరింగ్ చేస్తున్నారు. 2009 నుంచి దేశవాలీ వన్డే మ్యాచ్‌లు, టెస్ట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా సేవలందిస్తున్నారు. 2014లో 8 ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అంపైరింగ్ చేశారు పాఠక్. 2015లో తలకు హెల్మట్‌కు ధరించే అంపైరింగ్ చేసి ఆశ్చర్యపరిచారు. హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసిన తొలి భారత అంపైర్ పశ్చిమ పాఠకే కావడం విశేషం.

    POINTS TABLE:

    SCHEDULE TIME TABLE:

    ORANGE CAP:

    ఇది కూడా చదవండి:

    Hardik Pandya: గ్రౌండ్‌లో ఏలియన్... హార్దిక్ గుండుపై బీభత్సమైన ట్రోలింగ్

    David Warner: ఒకే ఒక్కడు వార్నర్.. ఐపీఎల్‌లో మరో కొత్త రికార్డు..

    Vijay shankar: విజయ్ శంకర్ కేక.. ఇదేంటి.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు..
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, IPL, IPL 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు