SRH vs DC, IPL 2020 Qualifier2: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ (Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూర్ ఆర్ డై లాంటింది. గెలిస్తే ఫైనల్‌కు వెళ్తారు. లేదంటే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తారు. అందుకే క్వాలిఫైయర్-2లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 17 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 11 సార్లు గెలవగా.. ఢిల్లీ జట్టు 6 సార్లు విజయం సాధించింది. ఈ లెక్కన ఢిల్లీలో SRHదే పై చేయి. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. సెప్టెంబరు 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అక్టోబరు 27న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంటే ఈ సీజన్లో కూడా ఢిల్లీపై హైదరాబాద్‌పై చేయి సాధించింది.
జట్ల బలాబలాలు:
హైదరాబాద్ జట్టులో ఇవాళైనా వృద్ధిమాన్ సాహా ఆడుతాడో లేదో చూడాలి. అతడు ఉంటే SRHకు అదనపు బలం చేకూరుతుంది. డేవిడ్ వార్నర్, మనీష్ పాండే చెలరేగితే హైదరాబాద్ భారీ స్కోర్ చేయగలదు. విలిమయ్సన్, గార్గ్, హోల్డర్ కూడా ధాటిగా ఆడే సామర్థ్యముంది. హోలర్డ్ ఇటు బ్యాట్.. అటు బాల్‌తో రాణిస్తుండడం హైదరాబాద్‌కు ప్లాస్ పాయింట్‌గా మారింది. ఇక బౌలింగ్‌లో సందీప్ శర్మ, నటరాజన్, రషీద్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నారు. నటరాజన్ అద్భుతంగా యార్కర్లు వేస్తుండడం కలిసొచ్చే అంశం. వీరు విజృంభిస్తే ఆర్సీబీనీ తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు.
క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే డకౌట్ అయ్యారు. పంత్, అయ్యర్ నిలకడలేమీ ఢిల్లీ జట్టుకు ఇబ్బందిగా మారింది. మరి ఈ మ్యాచ్‌లోనైనా బాగా ఆడుతారో లేదో చూడాలి. ఓపెనర్లు రాణిస్తే ఢిల్లీకి భారీ స్కోర్ సత్తా ఉంది. స్టోయినిస్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అన్రిచ్, రబడ, అక్షర్ పటేల్ రూపంలో బలమైన బౌలింగ్ ఉంది. వీరు చెలరేగితే హైదరాబాద్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు.
పిచ్ కండిషన్:
షేక్ జాయెద్ స్టేడియం పిచ్ గతం కంటే స్లోగా మారిపోయింది. స్పిన్నర్స్‌కు అనుకూలంగా తయారైంది. ప్రారంభ ఓవర్లలో పేసర్లకు స్వింగ్ లభించే అవకాశముంది. డ్యూ ఫాక్టర్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకొని.. చేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.
జట్లు ఇలా ఉండొచ్చు:
SRH: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియంగార్గ్/అభిషేక్ శర్మ, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి.నటరాజన్.
DC: శిఖర్ ధావన్, మార్కుస్ స్టోయినిస్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, హర్షల్ పటేల్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, అన్రిన్ నార్జీ, కాగిసో రబడ.