SRH VS DC IPL 2020 QUALIFIER2 SUN RISERS HYDERABAD VS DELHI CAPITALS SHREYAS AYYAR WON TOSS OPT TO BAT SK
SRH vs DC, IPL 2020 Qualifier2: టాస్ గెలిచిన శ్రేయస్.. ఢిల్లీ బ్యాటింగ్
డేవిడ్ వార్నర్, శ్రేయాస్ అయ్యర్ (Image;IPL)
SRH vs DC, IPL 2020 Qualifier2: ఢిల్లీలో రెండు మార్పులు చేశారు. పృథ్వీ షా స్థానంలో ప్రవీణ్ దుబే, డేనియల్ సామ్స్ స్థానంలో హెట్‌మెయిర్‌ను మళ్లీ టీమ్‌లోకి తీసుకున్నారు.
SRH vs DC, IPL 2020 Qualifier2: ఐపీఎల్ 2020 తుది అంకానికి చేరుకుంది. టోర్నీలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ (Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఢిల్లీలో రెండు మార్పులు చేశారు. పృథ్వీ షా స్థానంలో ప్రవీణ్ దుబే, డేనియల్ సామ్స్ స్థానంలో హెట్‌మెయిర్‌ను మళ్లీ టీమ్‌లోకి తీసుకున్నారు.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 17 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 11 సార్లు గెలవగా.. ఢిల్లీ జట్టు 6 సార్లు విజయం సాధించింది. ఈ లెక్కన ఢిల్లీలో SRHదే పై చేయి. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. సెప్టెంబరు 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అక్టోబరు 27న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంటే ఈ సీజన్లో కూడా ఢిల్లీపై హైదరాబాద్‌పై చేయి సాధించింది.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక..పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి.. మరో ఆరింట ఓడిపోయింది. ఇక హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి.. మరో ఏడింట పరాజయం పాలయింది. ఐతే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓడిపోవడం.. టాప్ ఆర్డర్ నిలకడలేమితో.. ఆ జట్టు ఇబ్బందులు పడుతోంది. మరోవైపు వరుస విజయాలతో హైదరాబాద్ దూకుడు మీదుంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూర్ ఆర్ డై లాంటింది. గెలిస్తే ఫైనల్‌కు వెళ్తారు. లేదంటే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తారు. అందుకే క్వాలిఫైయర్-2లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.