HOME »NEWS » »srh vs dc ipl 2020 qualifier2 sun risers hyderabad vs delhi capitals marcus stoinis came as opener sk

SRH vs DC, IPL 2020 Qualifier2: ఢిల్లీ ఓపెనర్‌గా స్టోయినిస్.. రైజర్స్‌ను రఫ్పాడిస్తున్నాడుగా..

SRH vs DC, IPL 2020 Qualifier2: ఢిల్లీ ఓపెనర్‌గా స్టోయినిస్.. రైజర్స్‌ను రఫ్పాడిస్తున్నాడుగా..
SRH vs DC, IPL 2020 Qualifier2: పవర్ ప్లేలో ఓపెనర్లు ఇద్దరు అద్భుతగా రాణించి మంచి ఆరంభం ఇచ్చారు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

SRH vs DC, IPL 2020 Qualifier2: పవర్ ప్లేలో ఓపెనర్లు ఇద్దరు అద్భుతగా రాణించి మంచి ఆరంభం ఇచ్చారు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

  • Share this:
    SRH vs DC, IPL 2020 Qualifier2: క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటిల్స్ ప్రణాళిక రూపొందించింది. జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. పృథ్వీ షా, సామ్స్‌ను పక్కనబెట్టి ప్రవీణ్ దుబే, హెట్‌మెయిర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. అంతేకాదు ఓపెనింగ్‌లోనూ మార్పులు చేసింది. సాధారణంగా పృథ్వీ షా లేకుంటే రహానే, ధావన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఇవాళ ధవన్‌కు తోడుగా స్టోనియిస్ ఓపెనర్‌గా వచ్చాడు. ఈ స్ట్రాటజీ వర్కువుట్ అయినట్లే కనిపిస్తోంది. ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగుతున్నాడు స్టోయినిస్. రెండో ఓవర్‌లో అతడి క్యాచ్‌ను హోల్డర్ డ్రాప్ చేయడంతో లైఫ్ వచ్చింది. దాన్ని స్టోయినిస్ చక్కగా ఉపయోగించుకున్నాడు. సందీప్ శర్మ, జేషన్ హోల్డర్‌ బౌలర్లను రఫ్పాడిస్తూ.. ఫోర్ల మోత మోగించాడు.

    అటు ధావన్ కూడా ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. పవర్ ప్లేలో ఓపెనర్లు ఇద్దరు అద్భుతగా రాణించి మంచి ఆరంభం ఇచ్చారు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇదే దూకుడు కొనసాగితే ఢిల్లీ భారీ స్కోర్ చేసే అవకాశముంది.



    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 17 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 11 సార్లు గెలవగా.. ఢిల్లీ జట్టు 6 సార్లు విజయం సాధించింది. ఈ లెక్కన ఢిల్లీలో SRHదే పై చేయి. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. సెప్టెంబరు 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అక్టోబరు 27న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంటే ఈ సీజన్‌లో కూడా ఢిల్లీపై హైదరాబాద్‌పై చేయి సాధించింది.

    లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక..పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి.. మరో ఆరింట ఓడిపోయింది. ఇక హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి.. మరో ఏడింట పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూర్ ఆర్ డై లాంటింది. గెలిస్తే ఫైనల్‌కు వెళ్తారు. లేదంటే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తారు. అందుకే క్వాలిఫైయర్-2లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:November 08, 2020, 19:57 IST