Home /News /ipl /

SPORTS NEWS INDIA VS AUSTRALIA FRESH OUTBREAK OF COVID IN ADELAIDE BUT CRICKET AUSTRALIA SAYS FIRST TEST ON SCHEDULE SA

భారత్×ఆసీస్‌ సిరీస్‌పై కరోనా ఎఫెక్ట్‌.. ఆ మ్యాచ్ రద్దుకానుందా?

టీమిండియా (File Photo)

టీమిండియా (File Photo)

కరోనా క్రీడారంగంపై ఎంతంటి ప్రభావం చూపిందో చూశాం. చాలా ఈవెంట్స్ ఈ మహామ్మారి కారణంగా వాయిదా పడుతూవచ్చాయి. కోవిడ్ ప్రభావం కాస్త తగ్గడంతో ఈవెంట్స్ ఇప్పుడిప్పుడే మెుదలవుతున్నాయి.

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలకూతలం చేసింది. మానవాళి మనుగడతోపాటు జీవరాశి ఉనికినే ప్రశ్నార్థాకం చేసే దిశగా  సాగింది. చైనాలో సంక్రమించిన కరోనా వైరస్‌ నేడు ప్రపంచ దేశాలకు గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావితం కానీ వ్యక్తి ఈ ఎవరూ లేరని చెప్పడంలో తిశయోక్తి లేదు. పేద,ధనిక ఇలా సముహ జీవానం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే ప్రభావమైంది. ముఖ్యంగా క్రీడారంగంపై తీవ్ర ప్రభావమైన చూపింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వివిధ క్రీడా సంఘాలు టోర్ని నిర్వహణ కోసం  ప్రయాత్నాలు మెుదలు పెట్టాయి.

    కరోనా క్రీడారంగంపై ఎంతంటి ప్రభావం చూపిందో చూశాం. చాలా ఈవెంట్స్ ఈ మహామ్మారి కారణంగా వాయిదా పడుతూవచ్చాయి. కోవిడ్ ప్రభావం కాస్త తగ్గడంతో ఈవెంట్స్ ఇప్పుడిప్పుడే మెుదలవుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితిలలో ఐపీఎల్ లాంటి బిగ్ లీగ్స్ నిర్వహణ స్పూర్తి భారీ ఈవెంట్స్ జరపడానికి వివిధ క్రీడా సంఘాలు సిద్దమవుతున్నాయి. బయో బబుల్ కఠిన నిబంధనల మధ్య ఎమ్‌రైట్స్ ప్రభుత్వ సహాకారంతో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది బీసీసీఐ. సుమారు రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. పోటాపోటీ సమరాలు ఉత్కంఠ కలిగించిన టై మ్యాచ్‌లు ప్రేక్షకులను టీవీలకు అతుక్కు పోయేలా చేసింది.

    ఈ ఈవెంట్ స్పూర్తితో ఐసీసీ మరిన్ని క్రీడా ఈవెంట్స్ నిర్వహణకు ముందుకొచ్చింది. త్వరలో ఆస్ట్రేలియా,భారత్ మధ్య సదీర్ఘ పర్యటన జరగనున్న విషయం తేలిసిందే!. నవంబర్‌ 27 నుంచి ఆ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నిలో భాగంగా భారత్,ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు,నాలుగు టెస్టులు ఆడనుంది.

    అయితే ఈవెంట్‌పై కరోనా నీలినీడాలు కమ్ముకుంటున్నాయి. అడిలైడ్‌లో కరోనా తీవ్రత ఉండటంతో భారత్×ఆసీస్‌ తొలి టెస్టుకు అడ్డంకులు ఏర్పాడే అవకాశం ఉంది. అయినప్పటికి షెడ్యూల్‌ ప్రకారమే టెస్టు నిర్వహించాలిని యోచిస్తున్నట్లు ఆసీస్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం భారత జట్టు 14 రోజుల పాటు నిబంధనల మధ్య సాధన మొదలుపెట్టింది. ఇక డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. దాని కంటే ముందు జరిగే వన్డే,టీ 20 మ్యాచ్‌లకు కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: India vs australia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు