SOURAV GANGULY REACTS CORONAVIRUS HITS CHENNAI SUPER KINGS CAMP AHEAD OF IPL 2020 SA
షెడ్యూల్ ప్రకారం చెన్నై ఆడటం డౌటే...సీఎస్కే స్ధానంలో మరో జట్టు
ఐపీఎల్ 2020 హంగమా మెుదలైంది. సెస్టెంబర్ 19 నుంచి నవంబర్10 వరకు యుఏఈలో టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. అందుకోసం ప్రాంఛైజీలు తమ జట్లను యుఏఈ తరలిస్తున్నాయి.
ఐపీఎల్ నెలకొన్న గందరగోళ పరిస్థితులపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిశితంగా పరీశిలిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మెుదటి మ్యాచ్ సీఎస్కే,ముంబాయి మధ్య ఉండడంతో ఆ సమయంలోపు చెన్నై జట్టు సన్నద్ధంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని బోర్డు పరిశీలిస్తోంది
ఐపీఎల్ నెలకొన్న గందరగోళ పరిస్థితులపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిశితంగా పరీశిలిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మెుదటి మ్యాచ్ సీఎస్కే,ముంబాయి మధ్య ఉండడంతో ఆ సమయంలోపు చెన్నై జట్టు సన్నద్ధంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని బోర్డు పరిశీలిస్తోంది. తాజాగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించారు. ముఖ్యంగా కరోనా కారణంగా చెన్నై
సూపర్ కింగ్స్ జట్టులో నెలకొన్న పరిస్థితిలపై మీడియాకు వివరించారు. " ప్రస్తుతం చెన్నై జట్టు అంతర్గత విషయాలపై మాట్లాడలేను. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం వారు లీగ్‌లో అడుతారా?లేదా అనేది మేము పరిశీలిస్తాం"మని తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన 13 మంది సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో జట్టలో తీవ్రమైన గందరగోళ పరిస్ధితులు ఏర్పాడ్డాయి. అసలు చెన్నై ఐపిఎల్ ఆడుతుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. బౌలర్ దీపక్ చాహర్, బ్యాట్స్ మాన్ రితురాజ్ గైక్వాడ్ లకు కరోన రావడంతో ఈ ప్రభావం మిగితా ప్లేయర్స్‌పై కూడా పడింది. కరోనా కేసులు బయట పడిన
సమయంలోనే స్టార్ ఆటగాడు సురేష్ రైనా టోర్నీ నుంచి నిష్ర్కమించడం,హర్బజన్ సింగ్‌తో సహా తదితర ఆటగాళ్ళు గడువులోపు టీంతో కలవకపోవడంతో ప్యాన్స్‌లో ఈ అనుమానులు కలిగిగాయి.
ఒక్కవేళ షెడ్యూల్ ప్రకారం చెన్నై జట్టు ఓపెనింగ్ మ్యాచ్‌కి రేడీగా లేకపోతే ఆ స్ధానంలో మరో జట్టును ఆడించాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. అయితే స్ధానంలో కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీని ఆడిస్తే బాగుంటుదనే అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.