టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో వ‌య్యారి భామ... మనసు పారేసుకున్న ధావన్

Shikhar Dhawan, Prithvi Shaw Dance On Bollywood Song

మ్యాచ్ కోసం ఆటగాళ్ళు నెట్‌లో ప్రాక్టీస్ సెషన్ షూరు చేశారు. సరాదగా ఆడుతూపడుతూ మానసిక ఒత్తిడి లేకుండా సాధన చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ మధ్యలో బ్యాట్స్‌మెన్లు శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీషా చేసిన ఓ ఫన్ని వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

 • Share this:
  త్వరలో ప్రారంభకానున్న ఆసీస్ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగితెలుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నా టీమిండియా కఠిన నిబంధనలు మధ్య ఆటగాళ్ళు సాధన చేస్తున్నారు. న‌వంబ‌ర్ 27న సిడ్నీలో ప్రారంభమయే తొలి వ‌న్డేతో  సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్ళు నెట్‌లో ప్రాక్టీస్ సెషన్ షూరు చేశారు. సరాదగా ఆడుతూపడుతూ  మానసిక ఒత్తిడి లేకుండా సాధన చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ మధ్యలో బ్యాట్స్‌మెన్లు శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీషా చేసిన ఓ ఫన్ని  వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.


  ఆ వీడియోలో పృథ్వీ అమ్మాయిగా వ‌య్యారంగా న‌డవగా... ఆమె వెంట ప‌డుతున్న హీరోలా శిఖ‌ర్ ధావన్.. పృథ్వీని అనుస‌రిస్తూ.. చొక్కాను విప్పేశాడు. ఈ క్రేజీ మూమెంట్ వీడియోను శిఖ‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు విపరితంగా వైరల్ అవుతుంది. " ఈ వయ్యారలా భామా నాకు మత్తేక్కిస్తోంది" అనే క్యాప్షన్ కూడా జతచేశాడు.  ఇక నవంబర్‌ 27 నుంచి ఆ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నిలో భాగంగా భారత్,ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు,నాలుగు టెస్టులు ఆడనుంది. అంతేకాదు ఆస్ట్రేలియాతో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది టీమిండియా. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19)లో తదుపరి మ్యాచ్‌లు జరుగుతాయి.

  వన్డే మ్యాచ్‌లు

  మెుదటి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ),
  రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ),
  మూడో వన్డే: డిసెంబర్ 2: (క్యాన్‌బెర్రా )

  టీ20 మ్యాచ్‌లు

  తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్‌బెర్రా),
  రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ),
  మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ),
  Published by:Rekulapally Saichand
  First published: