ఐపీఎల్‌లో డ్రగ్స్ .. బాత్‌రూంలో క్రికెటర్ల భార్యలు అలా చేయడం చూశా: షెర్లిన్‌


Updated: September 25, 2020, 3:32 PM IST
ఐపీఎల్‌లో డ్రగ్స్ .. బాత్‌రూంలో క్రికెటర్ల భార్యలు అలా చేయడం చూశా: షెర్లిన్‌
kkr team
  • Share this:


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యపై జరుగుతున్న విచారణ భిన్న కోణాలలో సాగుతోంది. సుశాంత్‌ మరణానికి డ్రగ్స్ వినియోగం కూడా ఓ కారణం కావచ్చని అనుమానిస్తున్న ఎన్సీబీ ఆ కోణంలో విచారిస్తోంది. ఈ విచారణలో బాలీవుడ్ పరిశ్రమలోని చికటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నటులు మారకద్వవ్వాలు వినియోగంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు.

బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌లకు నోటిసులిచ్చిన ఎన్సీబీ.. మరికొందరి పాత్రపై అనుమానం వ్యక్తం  చేస్తోంది.

బాలీవుడ్‌ను డ్రగ్స్ ఆంశం కుదిపెస్తున్న తరుణంలో నటి షెర్లిన్‌ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్‌ పార్టీల్లో డ్రగ్స్‌ ఉపయోగించేవారని తెలిపింది. " కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీలో క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకున్నారు. దానికి నేనేప్రత్యక్ష సాక్షిని,డ్రగ్స్ పాపంలో క్రికెటర్లకు భాగస్వామ్యం ఉందటూ" సంచలన ఆరోపణలు చేశారు.

"ఐపీఎల్ సందర్భంగా జరిగిన ఓ పార్టీకి నేను హజరయ్యాను. అప్పుడు కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ క్రికెటర్ల భార్యలు బాత్‌రూమ్‌లో కొకైన్‌ను పీల్చుస్తూ కనిపించారని" ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే సీని పరిశ్రమను ఊపిరాడకుండా చేస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు మరో అనూహ్య మలుపును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Published by: Rekulapally Saichand
First published: September 25, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading