news18-telugu
Updated: October 15, 2020, 3:30 PM IST
తండ్రి సచిన్‌తో సారా
Sara Tendulkar: సోషల్ మీడియాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఏంటి ఈ అమ్మాయికి పెళ్లయిందా? ఆ యువ క్రికెటర్‌నే పెళ్లి చేసుకుందా? అని రకరకాలుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీని కారణం గూగుల్..! సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో శుభమాన్ గిల్ వైఫ్ (shubman gill wife) అన్ని సెర్చ్ చేస్తే సారా టెండూల్కర్ పేరును చూపిస్తోంది. అంతేకాదు వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది.

వాస్తవానికి సారా టెండూల్కర్, యువ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్ మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు మాట్లాడుకోవడం..ఒకరి పోస్టులకు మరొకరు లైక్ చేయడంతో.. నిజంగానే వీరి మధ్య ఏదో ఉందన్న ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సెప్టెంబరు 29న ముంబై, కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్ తర్వాత కూడా శుభమాన్ గిల్ ఫీల్డింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. అక్కడ ఏమీ రాయనప్పటికీ హార్ట్ సింబల్ పెట్టింది. ఇంకేం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత మసాలా దొరికింది. ఆ తర్వాత అక్టోబరు 12న సారా టెండూల్కర్ 23వ పుట్టిన రోజును జరుపుకుంది. అనంతరం సారా ఇన్‌స్టగ్రామ్ స్టోరీల్లో శుభమాన్ ఫొటో ప్రత్యక్షమవడంతో.. వీరి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

శుభమాన్ గిల్
చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్‌లో shubman gill wife లేదా shubman gill girl friend అని సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ పప్పులో కాలేసి.. సారాను శుభమాన్ గిల్ భార్యగా చూపిస్తోంది. వాస్తవానికి వీరిద్దరికి పెళ్లి కాలేదు. కానీ సారాను శుభమాన్ గిల్ వైఫ్‌గా గూగుల్ చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ తీరు మారదా? ఆ అల్గారిథమ్ ఎన్ని తప్పులు చేస్తుందని నెటిజన్లు మండపడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం అచ్చ ఇలాంటి తప్పునే చేసి గూగుల్ విమర్శల పాలయింది. గూగుల్‌లో 'రషీద్ ఖాన్ భార్య' అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ అని వచ్చింది. వాస్తవానికి రషీద్ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. అనుష్క భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. కానీ గూగుల్ మాత్రం తప్పులో కాలేసింది. రషీద్ ఖాన్ 2018లో తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ వార్త ట్రెండింగ్‌గా మారడంతో అనుష్కను రషీద్ భార్యగా చూపిస్తోంది గూగుల్. ఐతే దీనిపై పెద్ద విమర్శలు రావడంతో.. గూగుల్ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అలా రావడం లేదు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 15, 2020, 3:21 PM IST