csk vs rr: అతన్ని ఎందుకు ఔట్ ఇవ్వలేదు .. అంపైర్‌పై సాక్షి ధోనీ ఫైర్

ఐపీఎల్ 2020లో ఎంఫైర్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టామ్ కర్రన్ ఔట్‌పై ధోనీ భార్య సాక్షి ఫైరయ్యారు.


Updated: September 23, 2020, 3:09 PM IST
csk vs rr: అతన్ని ఎందుకు ఔట్ ఇవ్వలేదు ..  అంపైర్‌పై సాక్షి ధోనీ ఫైర్
dhoni sakshi
  • Share this:
ఐపీఎల్ 2020లో ఎంఫైర్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టామ్ కర్రన్ ఔట్‌పై ధోనీ భార్య సాక్షి ఫైరయ్యారు. థర్డ్ అంపైర్‌ నిర్ణయాన్ని ఖండిస్తూ సాక్షి ట్వీట్ చేసి డిలీట్ చేసింది. చెన్నై బౌలర్ దీపక్ చాహర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వేసిన ఐదో బంతిని టామ్ కరన్ ఫుల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అది బ్యాట్‌కు తగలకుండా థై ఫ్యాడ్స్‌ని తాకుతూ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్ళింది.

దాన్ని ధోనీ.. అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ సి. షంషుద్దీన్ ఔట్‌గా ప్రకటించాడు. టామ్ కరన్ బంతి తన బ్యాట్‌కి తాకలేదని.. డీఆర్‌ఎస్ కోరే ప్రయత్నం చేసిన లాభం లేకపోయింది. అప్పటికే రివ్యూ అవకాశాన్ని రాహుల్ తెవాటియా వాడుకున్నాడు. దీంతో పెవిలియన్‌కి వెళ్లేందుకు ముందుకు కదిలిన టామ్.. అంపైర్లు చర్చించుకోవడం చూసి మధ్యలోనే అగిపోయాడు

POINTS TABLE:

అంపైర్లు చర్చ అనంతరం థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. రిప్లేలో ధోనీ బంతిని నేలకు తాకించినట్లు తేలింది. అలాగే బంతి కరన్ బ్యాట్‌ను హిట్ చేయలేదని థర్డ్ అంపైర్‌ పరిశీలనలో స్పష్టమైంది. దీంతో అంపైర్ షంషుద్దీన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే థర్డ్ అంపైర్ ఇక్కడో విషయాన్ని గమనించలేదు. ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాన్ని మాత్రం చెక్ చేయలేదు. ఈ విషయంపై స్పందించిన సాక్షి.. "థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడో,లేదో అని పరిశీలిస్తే టామ్ కర్రన్ పెవిలియన్‌కు చేరేవాడు" అంటూ ట్విట్ చేశారు. "టెక్నాలజీని సరైన విధంగా వాడాలి. క్యాచ్ , ఎల్బీడబ్ల్యూ రెండు ఔటే’’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత సాక్షి దాన్ని డిలీట్ చేసింది.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading