Updated: November 3, 2020, 11:54 PM IST
Vijay Shankar Escapes Grave Injury During IPL Game
క్రికెట్‌కు.. గాయాలకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి క్రికెటర్‌కు గాయం సుపరిచితమే.. ఇంజ్యూరీ కారణంగా చాలా మంది ఆటగాళ్ళ కీలక మ్యాచ్‌లకు దూరం కావడం. గాయాల కారణంగా ఆటలో కొన్ని విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ బంతి హెల్మెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మైదానంలోనే కుప్పకూలాడు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించి క్రీడాలోకాన్ని తీవ్ర ద్రిగ్భాంతికి గురిచేశారు. క్రికెట్ చరిత్రిలో ఇదో విషాదకర సంఘటనగా మిగిలిపోయింది.
ఇక ఐపీఎల్ 2020 కూడా చాలా మంది ఆటగాళ్ళ గాయాలబరిన పడడం చూశాం. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఆటగాళ్ళను ఇంజూరీస్ తీవ్రంగా వేధించాయి.
మార్ష్,భువనేశ్వర్ కుమార్,విజయ శంకర్ లాంటి ఆటగాళ్ళు మైదానంలో గాయపడి చివరకు టోర్నీకే దూరమయ్యారు. అయితే వీరిలో విజయ్ శంకర్‌కు అయిన
గాయం మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని కొంత ఆందోళన కలిగిిిిస్తుంది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ విసిరిన త్రో పరుగు తీసున్న విజయ్ శంకర్ మెడకు గట్టిగా తగిలింది. దీంతో ఫిజియోథెరపీ సహయంతో అతను తిరిగి మిగితా ఆటను కొనసాగించాడు. విజయ్‌కి హెల్మెట్ ఉండడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఇప్పుడు ఈ సంఘటన క్రికెట్ వర్గాలో చర్చనీయాశంగా మారింది. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రతి ఆటగాడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అయితే కొంత మంది ఆటగాళ్ళు స్పిన్నర్స్ బౌల్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌ను తీసేస్తున్నారు.
ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ బౌలరైనా, స్పిన్నరైనా ఖచ్చితంగా హెల్మెట్ ధరించే నిబంధన తీసుకురావాలి. ఒక్కవేళ అనుకుని సంఘటన జరిగితే ఆటగాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కావునా హెల్మెట్ తప్పినసరిగా ధరించే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా 'అంటూ ట్విటర్లో తెలిపాడు.
Published by:
Rekulapally Saichand
First published:
November 3, 2020, 7:46 PM IST