ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: శాంసన్‌కు సచిన్ ప్రశంస.. అది ఎంతగా బాధిస్తుందో తెలుసని ట్వీట్

IPL 2020: రాజస్తాన్ రాయల్స్ కీలక ఆటగాడు సంజు శాంసన్‌పై మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ పట్టిన క్యాచ్‌పై సచిన్‌ ట్విటర్‌లో స్పందించారు.

news18-telugu
Updated: October 1, 2020, 11:18 AM IST
IPL 2020: శాంసన్‌కు సచిన్ ప్రశంస.. అది ఎంతగా బాధిస్తుందో తెలుసని ట్వీట్
సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)
  • Share this:
రాజస్తాన్ రాయల్స్ కీలక ఆటగాడు సంజు శాంసన్‌పై మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ పట్టిన క్యాచ్‌పై సచిన్‌ ట్విటర్‌లో స్పందించారు. క్యాచ్ అందుకేనేటప్పుడు వెనక్కి పడి తలకు దెబ్బ తగిలితే తట్టుకోలేమని చెప్పారు. గతంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు తెలిపారు. " సంజు శాంసన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బాల్‌ను క్యాచ్ పట్టే సమయంలో బ్యాలెన్స్ తప్పి తల నేలకి తలిగితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలసు. 1992 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టే సమయంలో నేను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాను" అని సచిన్ ట్వీట్ చేశాడు.


శాంసన్ అందుకున్న క్యాచ్ ఇలా..

నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్‌కు‌ దిగింది. 18 ఓవర్‌లో రాజస్తాన్ ప్లేయర్ టామ్ కరన్ వేసిన ఓ బంతిని కమిన్స్ డీప్ బ్యాక్వార్డ్ స్వ్కేర్‌లోకి కొట్టాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద పీల్డింగ్ చేస్తున్న శాంసన్ గాల్లోకి కొద్దిగా ఎగిరి ఆ బాల్‌ను అందుకున్నాడు. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పడంతో వెనక్కి పడ్డాడు. దీంతో తల నేలకు తాకడంతో శాంసన్‌కు స్వల్ఫ గాయమైంది. శాంసన్ అద్బుతమైన క్యాచ్‌తో.. 10 బంతుల్లో 12 పరుగులు చేసిన కమిన్స్ పెవిలియన్‌కు చేరాడు.





ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోలకతా నైట్ రైడర్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ 47, మోర్గాన్ 34 పరుగులతో రాణించారు. ఇక, 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆ స్కోర్‌ను చేధించలేకపోయింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా జట్టు 37 పరుగులు తేడాతో విజయం సాధించింది.
Published by: Sumanth Kanukula
First published: October 1, 2020, 9:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading