• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • SACHIN TENDULKAR PICS FAVOURATE SIDE TO WIN IPL 2020

రాసిపెట్టుకోండి ఐపీఎల్ విజేత ఆ జట్టే...సచిన్ టెండుల్కర్ జోస్యం

రాసిపెట్టుకోండి ఐపీఎల్ విజేత ఆ జట్టే...సచిన్ టెండుల్కర్ జోస్యం

సచిన్ టెండుల్కర్(ఫైల్ ఫోటో)

ఈసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవబోయేది ఎవరు? ఈ ప్రశ్నలకు ఎక్కువ మంది చెబుతున్న సమాధానం ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం వీరితో ఏకీభవించడం లేదు. రాసిపెట్టుకోండి ఈ సారి కొత్త ఛాంపియన్ రాబోతున్నట్లు జోస్యం చెప్పాడు.

  • Share this:
    ఈసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవబోయేది ఎవరు? ఈ ప్రశ్నలకు ఎక్కువ మంది చెబుతున్న సమాధానం ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం వీరితో ఏకీభవించడం లేదు. రాసిపెట్టుకోండి ఈ సారి కొత్త ఛాంపియన్ రాబోతున్నట్లు జోస్యం చెప్పాడు. ఇంతకీ సచిన్ టెండుల్కర్ మొగ్గుచూపుతున్న ఆ ఫేవరెట్‌ జట్టు ఏదో తెలుసా? కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ విజేతగా నిలుస్తుందని సచిన్ చెబుతున్నాడు. ఆర్సీబీతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. తన సొంత జట్టు ముంబైని కాదని...బెంగళూరు ఫేవరేట్‌గా సచిన్ పేర్కొనడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. సచిన్ ఇలా పేర్కొనడం కొందరు ముంబై ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చడం లేదు.

    బెంగళూరు విజేతగా నిలుస్తుందని సచిన్ జోస్యం చెప్పడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ఐపీఎల్ కప్ ఆర్సీబీకి ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా కోహ్లీ సారథ్యంలోని జట్టు ఛాంపియన్‌గా నిలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    Published by:Janardhan V
    First published: