ఐపీఎల్ 2020

  • associate partner

RR vs MI, IPL 2020: సెంచరీతో స్టోక్స్ విధ్వంసం... రాయల్స్ బంపర్ విక్టరీ

IPL 2020 : రాబిన్ ఊతప్ప 13, స్టీవెన్ స్మిత్ 11 తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ.. బెన్ స్టోక్స్, సంజూ శామ్సన్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించారు.

news18-telugu
Updated: October 25, 2020, 11:16 PM IST
RR vs MI, IPL 2020: సెంచరీతో స్టోక్స్ విధ్వంసం... రాయల్స్ బంపర్ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్ విజయం (Image:IPL)
  • Share this:
IPL 2020: అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బెన్‌ స్టోక్స్ అదరగొట్టాడు. సెంచరీతో ముంబై ఇండియన్స్‌పై విరుచుకుపడ్డాడు. స్టోక్స్‌కు సంజూ శామ్సన్ చక్కటి సహకారం అందించడంతో..రాయల్స్ టీమ్ ఘన విజయం సాధించింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా చేధించింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో 196 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 60 బంతుల్లో 107 పరుగులు (14 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు. సంజూ శామ్సన్ 31 బంతుల్లో 54 రన్స్ (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు.


రాబిన్ ఊతప్ప 13, స్టీవెన్ స్మిత్ 11 తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ.. బెన్ స్టోక్స్, సంజూ శామ్సన్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు ఏకంగా 152 పరుగులు జోడించారు. జట్టు స్కోర్ 44 తర్వాత రాజస్థాన్‌లో ఒక్క వికెట్ కూడా పడలేదు. వీరిద్దరు చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ముంబై బౌలర్లలో ప్యాటిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 18, 20 ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 33, సూర్యకుమార్ యాదవ్ 40, ఇషాన్ కిషన్ 37, సౌరభ్ తివారి 34 పరుగులతో రాణించారు. డికాక్ 4, కీరన్ పొలార్డ్ 6 రన్స్ మాత్రమే చేశారు.

వాస్తవానికి ముంబై తొలి ఓవర్‌లోనే డికాక్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 90 పరుగుల వద్ద ఇషాన్, 95 వద్ద సూర్యకుమార్, 101 వద్ద పొలార్డ్ ఔట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా, సౌరభ్ తివారీ అద్భుతమగా ఆడారు. 19వ ఓవర్లో తివారి ఔట్ అయిన తర్వాత.. పాండ్యా మరింత చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో కార్తీక్ త్యాగిపై విరుచుకుపడి.. ముంబైకి భారీ స్కోర్ అందించాడు.

రాజస్థాన్‌ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్‌ను ఆటాడుకున్నారు ముంబై బ్యాట్స్‌మెన్. అతడు వేసిన 4 ఓవర్లలో ఏకంగా 60 రన్స్ పిండుకున్నారు. జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కార్తీక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై టీమ్ 11 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 11 విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంతకు ముందు ఓసారి రెండు టీమ్‌లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 6 జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది.

కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో నాలుగింటిలో ఓటమి పాలయింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి.. 5 మాత్రమే గెలిచింది. మరో ఏడింటిలో ఓడిపోయింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది స్మిత్ సేన.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading