ఐపీఎల్ 2020

  • associate partner

RR vs MI, IPL 2020 live score: హార్దిక్ సిక్స్‌ల మోత.. ముంబై భారీ స్కోర్

RR vs MI, IPL 2020 live score: 19వ ఓవర్లో తివారి ఔట్ అయిన తర్వాత.. పాండ్యా మరింత చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో కార్తీక్ త్యాగిపై విరుచుకుపడి.. ముంబైకి భారీ స్కోర్ అందించాడు.

news18-telugu
Updated: October 25, 2020, 9:24 PM IST
RR vs MI, IPL 2020 live score: హార్దిక్ సిక్స్‌ల మోత.. ముంబై భారీ స్కోర్
హార్దిక్ పాండ్యా (Image:IPL)
  • Share this:
IPL 2020: ఐపీఎల్ టోర్నీలో ప్రస్తుతం 45వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 18, 20 ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 33, సూర్యకుమార్ యాదవ్ 40, ఇషాన్ కిషన్ 37, సౌరభ్ తివారి 34 పరుగులతో రాణించారు. డికాక్ 4, కీరన్ పొలార్డ్ 6 రన్స్ మాత్రమే చేశారు.

వాస్తవానికి ముంబై తొలి ఓవర్‌లోనే డికాక్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 90 పరుగుల వద్ద ఇషాన్, 95 వద్ద సూర్యకుమార్, 101 వద్ద పొలార్డ్ ఔట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా, సౌరభ్ తివారీ అద్భుతమగా ఆడారు. 19వ ఓవర్లో తివారి ఔట్ అయిన తర్వాత.. పాండ్యా మరింత చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో కార్తీక్ త్యాగిపై విరుచుకుపడి.. ముంబైకి భారీ స్కోర్ అందించాడు.

రాజస్థాన్‌ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్‌ను ఆటాడుకున్నారు ముంబై బ్యాట్స్‌మెన్. అతడు వేసిన 4 ఓవర్లలో ఏకంగా 60 రన్స్ పిండుకున్నారు. జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కార్తీక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై టీమ్ 11 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 10 విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంతకు ముందు ఓసారి రెండు టీమ్‌లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 6 జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోసారి రాజస్థాన్‌ను ఓడించాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.

కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడింటింలో ఓటమి పాలయింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 4 మాత్రమే గెలిచింది. మరో ఏడింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading