RR vs MI, IPL 2020 live score: టాస్ గెలిచిన పొలార్డ్.. జట్లలో మార్పులు ఇవే

RR vs MI, IPL 2020 live score: ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ ఆడడం లేదు. ఒకే ఒక్కమార్పుతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతోంది. కౌల్టర్‌నైల్ స్థానంలో పాటిన్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

RR vs MI, IPL 2020 live score: ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ ఆడడం లేదు. ఒకే ఒక్కమార్పుతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతోంది. కౌల్టర్‌నైల్ స్థానంలో పాటిన్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ టోర్నీలో ప్రస్తుతం 45వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై కెప్టెన్ పొలార్డ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ ఆడడం లేదు. ఒకే ఒక్కమార్పుతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతోంది. కౌల్టర్‌నైల్ స్థానంలో పాటిన్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ మాత్రం టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌ల్లో ఆడిన ఆటగాళ్లే ఈ మ్యాచ్‌లోనూ ఆడుతున్నారు.



    జట్ల వివరాలు:
    Rajasthan Royals (Playing XI): రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి.

    Mumbai Indians (Playing XI): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా



    ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై టీమ్ 11 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 10 విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంతకు ముందు ఓసారి రెండు టీమ్‌లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 6 జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోసారి రాజస్థాన్‌ను ఓడించాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.

    కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడింటింలో ఓటమి పాలయింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 4 మాత్రమే గెలిచింది. మరో ఏడింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
    Published by:Shiva Kumar Addula
    First published: