ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 KKR vs MI; దూకుడుగా ఆడుతున్న ముంబై.. సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌

ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో ముంబై బాట్స్‌మెన్స్ దూకుడుగానే ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు.


Updated: September 23, 2020, 9:11 PM IST
IPL 2020 KKR vs MI;  దూకుడుగా ఆడుతున్న ముంబై.. సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌
rohith sharma
  • Share this:
ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో ముంబై బాట్స్‌మెన్స్ దూకుడుగానే ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ డికాక్‌ బారీ షాట్‌ ఆడే క్రమంలో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ వరుస ఫోర్లతో దాటిగా ఆడాడు.

ORANGE CAP:

నరైన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ కొట్టిన షాట్‌కు రెండో పరుగు తీసే ప్రయత్నంలో సూర్యకుమార్ (47) రనౌటయ్యాడు. అయినప్పటికి రోహిత్ తన
జోరు కొనసాగిస్తునే ఉన్నాడు. ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలవగా.. 6 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ గెలిచిన కోల్‌కత్తా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ టోర్నీలో కేకేఆర్‌కు ఇది మెుదటి మ్యాచ్ కాగా.. ముంబై ఇండియన్స్‌కి రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టైటిల్ రేసులో నిలవాలని చూస్తోంది.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading